ETV Bharat / international

నిరంకుశ పాలనలు ప్రపంచాన్ని నడిపించలేవు.. జిన్‌పింగ్‌ను తప్పుపట్టిన బైడెన్‌

'ప్రజాస్వామ్యం'పై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్​కు తప్పుడు అభిప్రాయం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.​ అగ్ర రాజ్య 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజు జిన్‌పింగ్‌తో జరిగిన ఓ ఫోన్ కాల్ సంభాషణ గురించి ఆయన తాజాగా వివరించారు. ‘ప్రజాస్వామ్యాలు క్షీణిస్తున్నాయి. నిరంకుశ పాలనలే ప్రపంచాన్ని ముందుకు నడుపుతాయి’ అని జిన్‌పింగ్ గతంలో తనతో స్పష్టం చేసినట్లు వెల్లడించారు.

Joe Biden: నిరంకుశ పాలనలు ప్రపంచాన్ని నడిపించలేవు.. జిన్‌పింగ్‌ను తప్పుపట్టిన బైడెన్‌

author img

By

Published : May 31, 2022, 5:54 AM IST

Updated : May 31, 2022, 6:42 AM IST

‘ప్రజాస్వామ్యాలు క్షీణిస్తున్నాయి. నిరంకుశ పాలనలే ప్రపంచాన్ని ముందుకు నడుపుతాయి’ అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గతంలో తనతో స్పష్టం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా వెల్లడించారు. నేవల్ అకాడమీ స్నాతకోత్సవంలో బైడెన్‌ ప్రసంగిస్తూ.. అగ్ర రాజ్య 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజు జిన్‌పింగ్‌తో జరిగిన ఫోన్ కాల్ సంభాషణ గురించి వివరించారు.

‘నిరంకుశత్వాలు, ప్రజాస్వామ్యాల మధ్య పోరాట ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ఇతర ప్రపంచ నాయకులతో పోల్చితే నేను జిన్‌పింగ్‌‌తో ఎక్కువసార్లు భేటీ అయ్యా. ఎన్నికల రాత్రి నన్ను అభినందించేందుకు ఆయన ఫోన్ చేసి.. గతంలో చాలాసార్లు చెప్పిన మాటే చెప్పారు. '21వ శతాబ్దంలో ప్రజాస్వామ్యాలు మనుగడ సాధించలేవు. నిరంకుశ పాలనలే ప్రపంచాన్ని నడిపిస్తాయి. ఎందుకంటే.. పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రజాస్వామ్యాల్లో ఏకాభిప్రాయం అవసరం. దానికి సమయం పడుతుంది. మీకు ఆ సమయం లేదు’ అని అన్నట్లు తెలిపారు. కానీ, ఈ విషయంలో జిన్‌పింగ్‌ది తప్పుడు అభిప్రాయమని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. చైనా, అమెరికాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే సాగుతోన్న విషయం తెలిసిందే. తైవాన్ పరిణామాలతో సమస్య కాస్త తీవ్రంగా మారింది. ఇటీవల జపాన్‌ పర్యటన సందర్భంగా బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తైవాన్‌ విషయంలో చైనా బలవంతంగా జోక్యం చేసుకొంటే.. అమెరికా సైనికపరంగా స్పందిస్తుంది. అది మేం చేసిన వాగ్దానం’ అని తెలిపారు. దీనిపై స్పందించిన చైనా.. అమెరికా నిప్పుతో ఆడుకుంటోందని ఘాటుగా విమర్శించింది. తైవాన్‌ విషయంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకొంటామని చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ పునరుద్ఘాటించారు.

ఇదీ చూడండి..

అఫ్గాన్​లో ఉగ్రవాదులకు శిక్షణ.. భారత్​కు ఐరాస హెచ్చరిక

Last Updated : May 31, 2022, 6:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.