ETV Bharat / international

టీనేజర్​ బర్త్​డే పార్టీలో కాల్పులు.. నలుగురు మృతి.. 20 మందికి గాయాలు

అమెరికాలో ఓ టీనేజర్​ బర్త్​డే పార్టీలో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 20 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు హవాయిలోని హొనొలులులో జరిగిన కోడిపందాల్లో ఓ గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 16, 2023, 8:08 PM IST

Updated : Apr 16, 2023, 9:47 PM IST

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. అలబామా రాష్ట్రంలో ఓ టీనేజర్​ బర్త్​డే వేడుకల్లో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. శనివారం రాత్రి 10:30 గంటల సమయంలో అలబామాలోని డాడెవిల్లేలో ఈ కాల్పులు జరిగాయని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి స్టేషన్ మహోగని మాస్టర్ పీస్ డ్యాన్స్ స్టూడియోలో జరుగుతున్న పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న గన్​తో షూట్​ చేశాడు. కాల్పులకు పాల్పడ్డాడనే కారణంతో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలబామాలోని మోంట్‌గోమెరీకి ఈశాన్య దిశలో 92 కిలోమీటర్ల దూరంలో ఉంది ఘటన జరిగిన ప్రాంతం. కాగా, ఈ ఘటనపై అలబామా గవర్నర్​ కే ఐవీ సోషల్​ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు.

కోడిపందేల్లో కాల్పులు.. ఇద్దరు మృతి..!
అమెరికాలోని హవాయి రాష్ట్ర రాజధాని హొనొలులులోనూ ఓ వ్యక్తి గన్​తో కాల్పులు జరిపాడు. కోడిపందేల ఈవెంట్​లో ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు పరస్పరం జరుపుకున్న ఈ కాల్పుల్లో ఇద్దరు అమాయకులు ప్రాణాలు విడివగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షన ఈ కాల్పులకు దారి తీసిందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న హొనొలులు పోలీసులు అనుమానితుడిగా ఉన్న 20 ఏళ్ల యువకుడి కోసం గాలిస్తున్నారు. ఇక్కడ నిర్వాహకులు ఓ పందెం పోటీలను నిర్వహించారు. పోటీలు ముగిశాక ఓ యువకుల గ్యాంగ్​ వాగ్వాదానికి దిగింది. ఇది కాస్త శారీరక దాడులకు దారి తీసింది. కొంత సమయానికి ఓ వ్యక్తి తన దగ్గరున్న పిస్టోల్​తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారని హొనొలులు పోలీస్ డిపార్ట్‌మెంట్ లెఫ్టినెంట్ దీనా థోమ్మెస్ ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. మృతుల్లో 59 ఏళ్ల మహిలతో పాటు 34 ఏళ్ల పురుషుడు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన మరో ముగ్గురు చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయినట్లు సమాచారం. కాగా, కాల్పులకు దారి తీసిన కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. కాగా, కోడిపందేలు అమెరికాలోని అన్ని రాష్టాల్లో నిషిద్ధం. అయితే హవాయి రాష్ట్రం సహా మరి కొన్ని ప్రాంతాల్లో వీటిని యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు కొందరు. ఇక్కడ జరిగే పందేల్లో వందలాది మంది పాల్గొంటారు.

Last Updated : Apr 16, 2023, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.