ETV Bharat / international

'లేడీస్​.. ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్లకు వెళ్లొద్దు'.. ప్రభుత్వం షాకింగ్​ నిర్ణయం - మహిళలు రెస్టారెంట్లకు వెళ్లడంపై తాలిబన్ల నిషేదం

అఫ్గానిస్థాన్ మహిళల హక్కులపై తాలిబన్లు మరోసారి ఆంక్షలను విధించారు. ఈ సారి మహిళలు రెస్టారెంట్లకు వెళ్లడంపై నిషేధం విధించారు. గార్డెన్​లు, పచ్చని ప్రదేశాలు ఉన్న రెస్టారెంట్లలోకి మహిళలకు అనుమతి లేదంటూ ఆదేశాలు జారీ చేశారు.

taliban-women-rights-taliban-ban-on-women-going-to-restaurants
మహిళలు రెస్టారెంట్లకు వెళ్లడంపై తాలిబన్ల నిషేదం
author img

By

Published : Apr 11, 2023, 9:55 AM IST

మహిళలు రెస్టారెంట్లకు వెళ్లడంపై నిషేధం విధించింది అఫ్గానిస్థాన్​లోని తాలిబన్ ప్రభుత్వం. గార్డెన్​లు, పచ్చని ప్రదేశాలు ఉన్న రెస్టారెంట్లలోకి మహిళలు వారి ఫ్యామిలీకి అనుమతి లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ప్రదేశాల్లో జెండర్​ మిక్సింగ్​ అవుతుందని మత గురువులు ఇచ్చిన ఫిర్యాదుతో తాలిబన్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు హెరాత్ ప్రావిన్స్‌లో పచ్చని ప్రదేశాలతో ఉన్న రెస్టారెంట్‌లకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని తాలిబన్​లు తెలిపారు.

"ఈ రెస్టారెంట్లలోకి పురుషులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రస్తుతం ఈ నిబంధనలను హెరాత్‌ ప్రావిన్స్​కు వరకు మాత్రమే పరిమితం చేస్తున్నాం. గార్డెన్​ ఉన్న రెస్టారెంట్లలో జెండర్​ మిక్సింగ్​ కావడం, మహిళలు హిజాబ్​ ధరించటం లేదన్న ఆరోపణలతోనే ఈ నిషేధం విధిస్తున్నాం. పార్క్​లు, పచ్చని ప్రదేశాలు, మహిళలు, పురుషులు కలుసుకోవడానికి వీలున్న రెస్టారెంట్లకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి." అని మినిస్ట్రీ ఆఫ్ వైస్ అండ్ వర్ట్యూ డైరెక్టరేట్‌ డిప్యూటీ అధికారి బాజ్ మహమ్మద్ నజీర్ తెలిపారు.

పండితులు, సాధారణ ప్రజల నుంచి దీనిపై పదేపదే ఫిర్యాదులు రావటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని బాజ్ మహమ్మద్ నజీర్ వెల్లడించారు. మిగతా రెస్టారెంట్లలోనూ ఫ్యామిలీకి, మహిళల అనుమతికి షరతులు ఉన్నాయని మీడియాలో వచ్చిన నివేదికలను ఆయన కొట్టి పారేశారు. వాటిని పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు. "ఇది ఒక పార్క్ లాగా ఉంది. అలాంటి దానికి రెస్టారెంట్ పేరు పెట్టారు. ఇందులో పురుషులు, మహిళలు కలిసి ఉంటారు. మా ఆడిటర్లు పురుషులు, మహిళలు వెళ్ళే అన్ని పార్కులను గమనిస్తున్నారు." అని హెరాత్‌లోని వైస్ అండ్ వర్చు డైరక్టరేట్ అధినేత అయిన అజీజుర్ ​రహ్మాన్ అల్ ముహాజిర్ తెలిపారు.

ఇప్పటికే ఎన్నో ఆంక్షలు
కొద్ది రోజలు క్రితం మహిళలు.. విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షకు హాజరుకాకుండా తాలిబన్ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఈ మేరకు అన్ని విశ్వవిద్యాలయలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి ప్రవేశ పరీక్షకూ దరఖాస్తు చేసుకునే అవకాశం మహిళలకు ఉండదని తెలిపింది. ఇప్పటికే అఫ్గాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాఠశాల విద్యపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. అంతకు ముందు ప్రభుత్వేతర కార్యాలయాల్లో మహిళల్ని పని చేయకుండా నిషేధం విధించింది తాలిబన్‌ సర్కార్‌. దీంతో అంతర్జాతీయంగా తీవ్ర విమర్శల్ని మూటగట్టుకుంది. తాలిబన్‌ ప్రభుత్వం మహిళలకు వ్యతిరేకంగా ఇప్పటికే ఎన్నో చట్టాలను అమల్లోకి తెచ్చింది. మహిళలు పార్కులు, జిమ్​లు వాడకుండా నిషేధం విధించింది. 2021 ఆగష్టులో తానిబన్లు ఆఫ్గానిస్ధాన్​లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.