ETV Bharat / international

Sweden Nato Membership : 32వ దేశంగా నాటోలోకి స్వీడన్.. ఉక్రెయిన్​కు మరోసారి నిరాశ

Sweden Nato Membership : నాటో కూటమిలో స్వీడన్‌ 32వ సభ్య దేశంగా అడుగుపెట్టబోతోంది. ఈ మేరకు లిథివేనియాలో జరుగుతున్న సమావేశంలో నాటో దేశాధినేతలు స్వీడన్‌ చేరికకు గ్రీన్​ సిగ్నల్ ఇచ్చారు. కాగా ఉక్రెయిన్​కు మరోసారి నిరాశ తప్పలేదు. ఆ దేశాన్ని ఎప్పుడు కూటమిలో చేర్చుకుంటారన్న విషయంపై స్పష్టత రాలేదు.

sweden got nato membership
నాటోలోకి స్వీడన్
author img

By

Published : Jul 12, 2023, 8:21 AM IST

Updated : Jul 12, 2023, 8:51 AM IST

Sweden Nato Membership : స్వీడన్‌కు అత్యంత కీలకమైన నాటో కూటమిలో సభ్యత్వం దక్కింది. 32వ దేశంగా స్వీడన్‌.. కూటమిలో చేరనుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తటస్థంగా ఉన్న స్వీడన్‌.. ఇప్పుడు రష్యా వ్యతిరేక బృందంలో ఆడుగుపెట్టనుంది. మరోవైపు నాటోలో చేరడానికి ఉవ్విళ్లూరుతున్న ఉక్రెయిన్‌కు నిరాశే మిగిలింది. ఆ దేశాన్ని కూటమిలో చేర్చుకుంటామని.. కానీ ఎప్పుడో అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు సభ్య దేశాలు. "ఉక్రెయిన్‌ కచ్చితంగా నాటోలో సభ్యత్వం పొందుతుంది. అందుకోసం కొన్ని విషయాల్లో మినహాయింపులు కూడా ఇస్తాము. అందుకోసం కార్యాచరణ రూపొందిస్తాము" అని నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ తెలిపారు.

  • Glad to announce that after the meeting I hosted with @RTErdogan & @SwedishPM, President Erdogan has agreed to forward #Sweden's accession protocol to the Grand National Assembly ASAP & ensure ratification. This is an historic step which makes all #NATO Allies stronger & safer. pic.twitter.com/D7OeR5Vgba

    — Jens Stoltenberg (@jensstoltenberg) July 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

లిథువేనియాలో జరుగుతున్న రెండు రోజుల సమావేశంలో మంగళవారం.. స్వీడన్ చేరికకు ఒప్పందం కుదిరింది. ఇన్ని రోజులు తుర్కియే, హంగరీలు స్వీడన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించాయి. తాజాగా ఆ దేశాలు మనసు మార్చుకోవడం వల్ల స్వీడన్​కు అడ్డంకి తొలగినట్లయ్యింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం జరిగిన అనంతరం ఆయా దేశాల అధ్యక్షులు స్వీడన్‌ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎఫ్‌-16 విమానాల అందజేత, ఐరోపా సమాజంలో తుర్కియేకు సభ్యత్వంపై జో బైడెన్‌ నుంచి మద్దతు లభించింది. ఇక ఉక్రెయిన్‌ చేరికకు కూడా కూటమి అంగీకరించినప్పటికీ.. ఇంకా ఎప్పుడనేది తేల్చలేదు. సభ్యత్వం ఇవ్వడానికి మాత్రం రోడ్‌మ్యాప్‌ తయారు చేస్తామని నాటో పేర్కొంది. అయితే దానికి ఎలాంటి కాల పరిమితి నిర్ణయించకపోవడం గమనార్హం.

కాగా ఈ నిర్ణయంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాటోలో తమ చేరిక ఎప్పుడా అన్నదానిపై క్లారిటీ ఇవ్వకపోవడాన్ని అనుచిత నిర్ణయంగా అయన అభివర్ణించారు. 'మిత్రులకు మేము చాలా విలువ ఇస్తాం. అలాగే మీరు కూడా ఉక్రెయిన్​ను గౌరవించాలి. మా సభ్యత్వానికి, ఆహ్వానానికి సంబంధించి ఎలాంటి నిర్దిష్ట కాలపరిమితి విధించకపోవడం అనేది పూర్తిగా అసంబద్ధమైంది. అనిశ్చితి అనేది బలహీనత. సదస్సులో ఆ విషయంపై బహిరంగంగా మాట్లాడతా' అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.
సమావేశంలో రెండో రోజైన బుధవారం జెలెన్‌స్కీ.. అమెరికా అధ్యక్షుడు బైడెన్​తో పాటు ఇతర నాయకులతో కలవనున్నారు. ఆయనను బుజ్జగించడానికి నాటో - ఉక్రెయిన్‌ పేరుతో ఓ మండలి ఏర్పాటు చేసి, రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు సహాయం చేస్తామని ప్రకటించే అవకాశాలున్నాయి.

రష్యా హెచ్చరిక : నాటో కూటమిలో స్వీడన్​ను చేర్చుకోవడం పట్ల రష్యా మండిపడింది. నాటోను విస్తరించాలనుకోవడమే.. ఉక్రెయిన్​తో ఘర్షణకు కారణం అని తెలిపింది. ఇప్పటికీ ఐరోపా దేశాలు వారి తప్పిదాలను గుర్తించడం లేదు. ఒకవేళ నాటోలో ఉక్రెయిన్​కు సభ్యత్వం ఇచ్చినట్లుయితే.. పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ హెచ్చరించారు.

Last Updated : Jul 12, 2023, 8:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.