ETV Bharat / international

కెనడాలో వరుస కత్తి దాడులు.. ఆ వర్గమే టార్గెట్.. 10 మంది మృతి - Canada hunts stabbing spree suspects

Canada mass stabbing : కెనడాలో వరుస కత్తిపోట్ల ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వెల్డన్ సమీపంలోని ఓ పట్టణంలోని ఓ వర్గానికి చెందిన వారిపై ఈ దాడులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Canada mass stabbing
Canada mass stabbing
author img

By

Published : Sep 5, 2022, 9:08 AM IST

Canada mass stabbing : కెనడాలో వరుస కత్తిపోట్ల ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనల్లో 10 మంది మృతిచెందగా మరో 15 మంది గాయపడ్డారు. సస్కాచెవాన్‌ ప్రావిన్సులోని 13 ప్రాంతాల్లో 10 మంది మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వెల్డన్ సమీపంలోని ఓ పట్టణంలోని ఓ వర్గానికి చెందిన వారిపై ఈ దాడులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. వరుస ఘటనలతో సస్కాచెవన్‌ ప్రావిన్సులో అత్యవసర పరిస్థితిని విధించారు.

కత్తిపోట్లకు సంబంధించి ఉదయం నుంచి వరుసగా ఫోన్లు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దారుణాన్ని ఇద్దరు దుండగులు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు వారికోసం గాలింపు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొంతమంది బాధితులను లక్ష్యంగా పెట్టుకుని ఈ దాడులకు పాల్పడిన దుండగులు.. మరికొంత మందిని యాదృచ్ఛికంగా దాడిచేసినట్లు భావిస్తున్నారు. కత్తిపోట్ల ఘటనల్లో గాయపడిన వారికి యుద్ధ ప్రాతిపదికన చికిత్స అందిస్తున్నట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ దాడులు భయంకర, హృదయవిదారకమైనవిగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అభివర్ణించారు. స్థానిక అధికారులతో పరిస్థితిని సమీక్షస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'బ్రిటన్ ప్రధాని రేసులో ఓడిపోతే?'.. రిషి సునాక్ స్పందన ఇదే

బ్రిటన్ తదుపరి ప్రధానిగా.. లిజ్ ట్రస్ ఎన్నిక లాంఛనమేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.