ETV Bharat / international

అక్కడ లీటర్ పెట్రోల్ రూ.338- భగ్గుమంటున్న ప్రజలు - శ్రీలంక పెట్రోల్ ధరలు

Fuel Prices: సంక్షోభంలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీలంక ప్రజలకు ఇంధన ధరలు గుదిబండలా మారాయి. లంక చమురు సంస్థ మరో రూ.84 పెంచడం వల్ల ఆ దేశంలో లీటర్​ పెట్రోల్ ధర ఏకంగా రూ.338కి చేరింది. మరోవైపు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయాలని ప్రధాని మహింద రాజపక్స ప్రతిపాదించారు.

Sri Lanka crisis
రూ.338కి చేరిన పెట్రోల్ ధర.. తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు
author img

By

Published : Apr 19, 2022, 12:50 PM IST

Updated : Apr 19, 2022, 1:00 PM IST

Srilanka Crisis: తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఇంధన ధరలు మండుతున్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర 338 రూపాయలకు చేరుకుంది. శ్రీలంకలోని చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ-LIOC పెట్రోల్ రేట్లను పెంచిన మరుసటి రోజే.. దానికి అనుగుణంగా శ్రీలంక ప్రభుత్వ చమురు సంస్థ- సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (CPC) సైతం సోమవారం అర్ధరాత్రి రేట్లను పెంచింది. 92 ఆక్టేన్‌ పెట్రోల్‌ ధరను 84 రూపాయల మేర సీపీసీ పెంచింది. ఫలితంగా లీటర్ పెట్రోల్ ధర 338 రూపాయలకు చేరుకుంది. శ్రీలంకలో గత ఆరునెలల కాలంలో LIOC ఇంధన ధరలను పెంచడం ఇది ఐదోసారి కాగా, సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ నెల వ్యవధిలో రెండు సార్లు పెట్రోల్ రేట్లను పెంచింది. ఇప్పటికే ఇంధన, ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్న లంకేయులను తాజా పెంపు మరిన్ని ఇబ్బందులకు గురిచేయనుంది.

Srilanka Crisis
కొలంబోలో ప్రజల నిరసన

రాజ్యాంగ సవరణ: ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో రాజ్యాంగ సవరణ చేయాలని ప్రతిపాదించారు శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, పరిపాలన జవాబుదారీగా ఉండేలా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతిపాదనను కేబినెట్ ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపింది. కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ, శాసనంతో కూడిన రాజ్యాంగ సవరణను ప్రధాని ప్రతిపాదిస్తారని ప్రభుత్వ వార్తా సంస్థ డైలీ న్యూస్ తెలిపింది.

Srilanka Crisis
కొలంబోలో ప్రజల నిరసన

మరోవైపు లంకలో సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అధ్యక్షుడు అతని కుటుంబ తప్పుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. రాజధాని కొలంబోలోని అధ్యక్ష కార్యాలయం ముందు వరుసగా 11వ రోజు ఆందోళనలకు దిగారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స వల్లే దేశంలో ఈ పరిస్థితి తలెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని అధ్యక్షుడు కూడా సోమవారం అంగీకరించారు.

Srilanka Crisis
కొలంబోలో ప్రజల నిరసన
Srilanka Crisis
కొలంబోలో ప్రజల నిరసన

ఇదీ చదవండి: Ukraine Crisis: రష్యా క్షిపణుల ప్రయోగం.. 13 మంది మృతి

Last Updated : Apr 19, 2022, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.