ETV Bharat / international

H1B వీసాదారులకు గుడ్​న్యూస్.. వారికి లైన్ క్లియర్.. హాయిగా పనిచేసుకోవచ్చు! - హెచ్4 వీసా హోల్డర్ ఇండియా

హెచ్1బీ వీసాలపై అమెరికా వెళ్లిన భారతీయులకు అక్కడి స్థానిక కోర్టు గుడ్​న్యూస్ చెప్పింది. హెచ్1బీ వీసాదారుల భాగస్వాములు అమెరికాలో పని చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

spouse-of-h1b-work-permit
spouse-of-h1b-work-permit
author img

By

Published : Mar 30, 2023, 10:49 AM IST

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు గుడ్​న్యూస్. హెచ్1బీ వీసాలదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో పనిచేయకుండా అడ్డుకోవాలన్న వ్యాజ్యాన్ని అక్కడి కోర్టు తిరస్కరించింది. హెచ్1బీ వీసాదారుల భార్య/భర్త అమెరికాలో నిరభ్యంతరంగా పనిచేసుకోవచ్చని తీర్పు చెప్పింది. ఈ వీసాలపై ఎక్కువ సంఖ్యలో అమెరికాకు వెళ్తున్నది భారతీయులే. ఈ నేపథ్యంలో తాజా తీర్పు ఎంతో మంది భారతీయులకు ప్రయోజనం కలిగించేదని నిపుణులు చెబుతున్నారు.

హెచ్1బీ అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. విదేశీయులను తమ కంపెనీల్లో చేర్చుకునేందుకు ఈ వీసా అనుమతిస్తుంది. సాంకేతిక నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులను ఆకర్షించేందుకు ఈ వీసాలను అక్కడి కంపెనీలు ఉపయోగించుకుంటాయి. సాధారణంగా భారత్, చైనాకు చెందిన ఉద్యోగులే ఎక్కువగా ఈ వీసాలపై అమెరికా వెళ్తుంటారు. ఈ వీసాలపై అమెరికా వెళ్లే ఉద్యోగుల భాగస్వాములు (హెచ్4 వీసాదారులు) సైతం అక్కడ పనిచేసుకునేలా ఒబామా హయాంలో ఆదేశాలు జారీ అయ్యాయి. దీన్ని వ్యతిరేకిస్తూ.. 'సేవ్ జాబ్స్ యూఎస్ఏ' అనే సంస్థ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దీన్ని అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి తాన్య చుట్​కాన్ కొట్టేశారు. హెచ్4 వీసాదారులు పనిచేసుకునేందుకు అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వానికి అనుమతులు ఉన్నాయని ఆమె తన తీర్పులో స్పష్టం చేశారు.

"అమెరికాలో విదేశీయులకు పనిచేసుకునే అవకాశం కల్పించేలా డిపార్ట్​మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీకి కాంగ్రెస్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని పిటిషనర్లు వాదిస్తున్నారు. కానీ, ఈ వాదన దశాబ్దాలుగా కాంగ్రెస్ అనుమతులతో కార్యనిర్వాహక శాఖ చేస్తున్న పనికి విరుద్ధంగా ఉంది. హెచ్4 వీసాదారులకు పనిచేసుకునే అవకాశం కల్పించాలని అమెరికా ప్రభుత్వానికి కాంగ్రెస్ స్పష్టమైన అధికారం ఇచ్చింది."
-తాన్య చుట్​కాన్, అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి

ఈ తీర్పును భారతీయ అమెరికన్లు స్వాగతిస్తున్నారు. వలసదారుల హక్కుల కోసం పోరాడే స్థానిక నేత అజయ్ భుటోరియా కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. వేలాది మందికి ఈ తీర్పు ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. హెచ్1బీ వీసాదారులు తమ కుటుంబంతో కలిసి ఉండేలా ఈ నిర్ణయం వీలు కల్పిస్తుందని అన్నారు. కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నవారికి ఇది ఊరట కలిగించే తీర్పు అని కొనియాడారు.

సేవ్ జాబ్స్ యూఎస్ఏ వాదన ఇలా..
అమెరికాలోని ఐటీ వర్కర్లు కలిసి సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. హెచ్1బీ వీసాదారుల కారణంగా తాము ఉద్యోగాలు కోల్పోయామని పేర్కొంటూ వీరు వాదిస్తుంటారు. న్యాయ స్థానంలో వీరు దాఖలు చేసిన పిటిషన్​ను అమెజాన్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు పూర్తిగా వ్యతిరేకించాయి. ఈ పిటిషన్​పై ప్రతికూల తీర్పు వచ్చిన నేపథ్యంలో ఎగువ కోర్టులో అప్పీల్ చేయనున్నట్లు సేవ్ జాబ్స్ యూఎస్ఏ వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.