Single Malt Auction : ప్రముఖ అంతర్జాతీయ వేలం సంస్థ సోథెబి లండన్‌లో నిర్వహించిన వేలంలో మెకలాన్ కంపెనీ తయారు చేసిన సింగిల్ మాల్ట్ విస్కీ రూ. 22 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. 2019లో ఇదే కంపెనీ తయారు చేసిన విస్కీ రూ. 15 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ వేలంలో తన పేరు మీద ఉన్న ఆ రికార్డును మెకలాన్ కంపెనీ తిరగ రాసింది. ఈ నెల 18న జరిగిన వేలంలో దీని ధర రూ. 12 కోట్లు పలుకుతుందని నిపుణులు అంచనా వేశారు. కానీ అనూహ్యంగా రూ. 22 కోట్లకు ఈ పురాతన విస్కీ బాటిల్ అమ్ముడుపోయి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
1926లో 40 బాటిళ్ల విస్కీ తయారీ
Rare Single Malt Whisky Auction : మెకలాన్ కంపెనీ 1926లో ఈ విస్కీని తయారు చేసి.. 60 ఏళ్లు నిలవ చేసింది. దానిని 1986లో 40 బాటిళ్లలో నింపింది. కానీ ఈ కంపెనీ వీటన్నింటిని అమ్మకానికి ఉంచలేదు. కొన్నింటిని మెకలాన్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంచింది. ప్రతి ఒక్క వేలందారు ఇటవంటి విస్కీని విక్రయించాలని కోరుకుంటారని.. అలాగే ప్రతి ఒక్క కొనుగోలుదారు దీనిని సొంతం చేసుకోవాలనుకుంటారని వేలం నిర్వహించిన సోథెబి సంస్థ నిర్వాహకులు తెలిపారు.
![Single Malt Auction](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-11-2023/20062860_single_malt_whisky_price.jpg)
అత్యంత అరుదైన లేబుళ్లతో అలంకారం
Single Malt Whisky Price : మెకలాన్ కంపెనీ తయారు చేసిన 40 బాటిళ్లలో రెండు బాటిళ్లకు ఇప్పటివరకు లేబుళ్లు లేవు. 14 విస్కీ బాటిళ్లకు ప్రత్యేకమైన, అత్యంత అరుదైన లేబుళ్లతో అలంకరించారు. మరో 12 బాటిళ్లకు ఇంగ్లాండ్‌కు చెందిన సర్ పీటర్ బ్లాక్ లేబుళ్లను రూపొందించారు. మిగిలిన 12 విస్కీ బాటిళ్లకు లేబుళ్లను ఇటాలియన్ ప్రముఖ పెయింటర్ వలేరియో అడామితో తయారు చేయించారు. ప్రస్తుతం వేలంలో ఉన్న బాటిల్‌కు కార్కును మార్చి.. లేబుల్‌కు కొత్త జిగురును అంటించి అందబాటులో ఉంచారు. ఈ 40 విస్కీ బాటిళ్లలో ఓ బాటిల్ 2011 జపాన్‌లో సంభవించిన భుకంపంలో ధ్వంసమవగా, మరో దాన్ని ఓపెన్ చేసి తాగారని వేలం నిర్వహకులు తెలిపారు.
1,100 ఏళ్ల నాటి బైబిల్.. రూ.300 కోట్లకు వేలం.. స్పెషల్ ఏంటంటే?