ETV Bharat / international

వాలంటైన్స్​ వీక్​ వచ్చేసింది.. ప్రేమికుల వారం ప్రత్యేకతలేంటో తెలుసా..? - వాలంటైన్స్ వీక్ 2023

ప్రతి మనిషి జీవితంలో ప్రేమ అనేది ఒక విరిసిన పువ్వు లాంటిది. ప్రేమ అనే పేరును తల్చుకున్న మనస్సులో ఆనందం వికసిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి తెలుస్తుంది అది చెప్పే తీపి కబుర్లు ఏంటో. ప్రేమలో ఉంటే ఓ కొత్త ప్రపంచంలో విహరిస్తుంటాము. ప్రతిదానిని అందంగా చూడగలిగే శక్తి దీనికి ఉంది. రెండక్షరాలయిన దాని ప్రభావం మనసులో పదిలమై ఉంటుంది. మరి ఇంత గొప్ప శక్తి ప్రేమకు ఉంది. దీనికోసం ఒక వారం ప్రత్యేకంగా ఉంది. సంవత్సరమంతా ప్రేమలో ఉండటం ఒక ఎత్తయితే ఫిబ్రవరిలో ఒక వారం పాటు జరిగే ప్రేమ సందడి మరో ఎత్తనే చెప్పాలి. వారం రోజుల పాటు జరిగే ప్రేమ విహారం ప్రేమికులకు మరిచిపోని జ్ఞాపకాలనెన్నో ఇస్తుంది.

significance of valentine week 2023
significance of valentine week 2023
author img

By

Published : Feb 7, 2023, 7:42 PM IST

ప్రేమ పక్షులకు ఫిబ్రవరి నెల ఒక ఆనంద కోలాహలం అనే చెప్పాలి. ప్రతిక్షణం ప్రేయసికై తపించే వారికి.. కొత్తగా ప్రేమ గూటికి చేరాలనుకునేవారికి వాలంటైన్ వారం ఒక వరమే. ఒక్కరు కాస్త ఇద్దరై.. ఒకరికి ఒకరు తోడై నిలిచేలా చేస్తుంది ఈ ప్రేమ. మరి ఆ వాలంటైన్​ వారం వచ్చేసింది. లవర్స్​లో సందడి తెచ్చింది. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు జరిగే ఈ ప్రేమికుల వారం జంటల మధ్య విడదీయరాని బంధాన్ని బలపరుస్తుంది. ప్రేమికులకు ఎంతో ప్రియమైన వాలంటైన్ వీక్​లో ప్రతిరోజు ఒక కొత్త అనుభూతే. ప్రేమ మనస్సులు దోబూచులాడే ఆ వారం లవర్స్​కు ఎంతో ప్రత్యేకం. వాలంటైన్స్ డే, హగ్ డే, కిస్​ డే, టెడ్డీ డే అని ఇలా రకరకాల కార్యక్రమాలు ఈ వారంలో జరుగుతాయి. ప్రేమికులు ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చుకుంటూ, తమ భావాలను వ్యక్తపరుచుకుంటూ ఆనంద లోకంలో తేలియాడుతుంటారు. మరి వారం రోజులపాటు జరిగే ప్రేమ పండుగలోని ప్రత్యేకతలేంటో మీకోసం.

ఫిబ్రవరి 7 రోజ్ ​డే
వాలంటైన్​ వారంలో మొదటిరోజు రోజ్ డే. ప్రేమ వారంలో మొదటి రోజును అందమైన గులాబీతో ఆహ్వానిస్తారు. తమకిష్టమైన వారికి గులాబీ పువ్వులతో తమ ప్రేమ సందేశాన్ని పంపుతారు. ఆ వ్యక్తులు తమ జీవితంలో ఎంత ముఖ్యమనే విషయాన్ని ఈ గులాబీల ద్వారా తెలియజేస్తారు. గులాబీలతో ప్రేమ మాధుర్యాన్ని తమ ప్రియసఖికి చెబుతారు. ప్రేమకు చిహ్నంగా ఎర్ర గులాబీలను ఇచ్చుకుంటారు.

ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే
రోజ్​ డే తర్వాత ప్రపోజ్ డే. తమ ప్రియ సఖికి చెప్పాలనుకున్న ఎన్నో విషయాలను ఈరోజు వ్యక్తపరుస్తారు. ఎదలోతుల్లో ఏరులై పారుతున్న ప్రేమ ప్రవాహాన్ని గురించి వివరిస్తారు. తమ పట్ల ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తారు. మనస్సులో ఎగిసిపడుతున్న ప్రేమ జ్వాలను తమ ప్రియమైన వారితో పంచుకుంటారు. తమకు ఇష్టమైన వారికి ప్రపోజ్ చేయడానికి ఈరోజును ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అందుకే ఈరోజునే చాలా మంది వారికి ఇష్టమైన వారికి తమ ప్రేమ గురించి చెబుతుంటారు.

ఫిబ్రవరి 9 చాక్లెట్ డే
వాలంటైన్​ వీక్​లో మూడో రోజు చాక్లెట్ డే. చాక్లెట్లు అంటే అందరికీ ఒకలాంటి ఎమోషన్ ఉంటుంది. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు కొంచెం ఎక్కువే. ప్రేమికులు ఈ రోజున ఒకరికి ఒకరు చాక్లెట్లను ఇచ్చుకొని తమ ప్రేమను వ్యక్త పరుచుకుంటారు. కేవలం చాక్లెట్లు కదా అనిపించినా వాటి ద్వారా ప్రేమికులకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. భాగస్వాముల బంధం మరింత బలపడటానికి ఇది మంచి రోజనే చెప్పాలి. చాక్లెట్లు పంచుకొని తమ ప్రేమను వ్యక్తపరిస్తే భాగస్వామి కళ్లలోని ఆనందం ఈ ప్రపంచానికే వెలుగునిచ్చేలా ఉంటుంది.

ఫిబ్రవరి 10 టెడ్డీ డే
వాలంటైన్​ వీక్​లో నాలుగో రోజు టెడ్డీ డే. చాలా మంది అమ్మాయిలకు టెడ్డీలంటే ఇష్టం. అబ్బాయిలు తమ ప్రేయసిని ఆనంద పరచడానికి టెడ్డీలను బహుమతులుగా ఇస్తుంటారు. టెడ్డీ బేర్స్.. ప్రేమ, ఆప్యాయతకు ప్రతీక. మనకు ఇష్టమైన వారికి టెడ్డీను గిఫ్ట్​గా ఇస్తే వారి మనస్సు ఆనంద లోకంలో విహరిస్తుంటుంది.

ఫిబ్రవరి 11 ప్రామిస్ డే
వాలంటైన్​ వీక్​లో ఐదో రోజు ప్రామిస్ డే. ఎల్లప్పుడూ ఒకరికి ఒకరు తొడుగా ఉండాలని.. మనుషులు ఇద్దరైనా మనసులు ఒకటై కలకాలం ప్రేమతో ఒకరికి ఒకరం తోడుగా ఉండాలని ప్రామిస్​లు వేసుకుంటారు ప్రేమికులు. మాటలు కొన్నైనా దాని ప్రభావం వారి బంధంపై ఎంతో పడుతుంది. ఒకరిపై ఒకరు తమ ప్రేమను పంచుకుంటూ కష్టసుఖాల్లో తోడుగా ఉండాలని మాట ఇచ్చుకుంటారు. ప్రామిస్ అనేది ప్రేమలో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాన్ని మరింత పెంచుతుంది.

ఫిబ్రవరి 12 హగ్​డే
వాలంటైన్​ వీక్​లో ఆరో రోజు హగ్​ డే. ఎన్ని బహుమతులిచ్చినా ప్రేమతో ఇచ్చే ఒక హగ్​.. వారిద్దరి మధ్య ప్రేమను మరింత పెంచుతుంది. ప్రేమికులు ఒకరిపట్ల ఒకరు ప్రేమను వ్యక్తపరుచుకొని లోతైన ప్రేమతో ఆలింగనం చేసుకుంటారు. ఆ వెచ్చని కౌగిలిలోని ప్రేమ వారిని మరింత దగ్గరకి చేస్తుంది. మాటల్లో చెప్పలేని ప్రేమను ప్రేమికులు ఇలా హగ్​తో చెప్పుకుంటారు. పదాలు చెప్పలేని భావన మంచి కౌగిలి చెప్పగలదు. ప్రేమలో ఉన్నవారు మాత్రమే దాని మాధుర్యాన్ని అనుభవించగలరు.

ఫిబ్రవరి 13 కిస్​ డే
వాలంటైన్​ వీక్​లో ఏడో రోజు కిస్ డే. ముద్దు అనేది ఎనలేని ప్రేమకు సంకేతం. ఆ వ్యక్తిపై ఎంత ప్రేమ ఉందో ఒక ముద్దు తెలియజేస్తుంది. ప్రేమికులు తమ అమితమైన ప్రేమను ఒకరితో ఒకరు పంచుకొనేందుకు ప్రేమగా ముద్దులు పెట్టుకుంటారు. దీని ద్వారా ప్రేమికులిద్దరు ఒక్కటైపోయినట్లే. లవర్స్ మధ్య ప్రేమ మరింతగా పెరిగేలా చేస్తుందీ ముద్దు.

ఫిబ్రవరి14 వాలంటైన్స్ డే
వాలంటైన్​ వారంలో చివరిరోజు. ప్రేమికులకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ప్రేమికులు తమ ప్రేమను పండగలా జరుపుకునే రోజు. పెళ్లి రోజు ఎలానో వాలంటైన్​ వారంలో చివరి రోజు అలా. ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ బంధం చిరకాలం కొనసాగేలా తమ ప్రేమ వేడుకను జరుపుకుంటారు. ప్రేమ మాటలతో దోబూచులాడుకుంటూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ.. తమ జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు మిగిలిపోయేలా ఈరోజును జరుపుకుంటారు. ఇంతటి అద్భుతమైన వారంలో ప్రేమికులకు తమ జీవితాంతం మిగిలిపోయే జ్ఞాపకాలను పొందుతారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.