shootings in us 2022: అమెరికాలో మరోమారు తుపాకుల మోత మోగిపోయింది. వారాంతంలో చికాగోలోని పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు వెలుగుచూశాయి. ఇందులో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. 16 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియో వెల్లడించింది. గత శుక్రవారం సాయంత్రం తొలిసారి ఎన్బీసీ చికాగోలోని సౌత్ కిల్పట్రిక్ ప్రాంతంలో తుపాకీ పేలింది. ఈ ఘటనలో ఓ 69 ఏళ్ల వృద్ధుడు మరణించాడు.
నగరంలోని బ్రిఘ్టోన్ పార్క్, సౌత్ ఇండియానా, నార్త్ కెడ్జీ అవెన్యూ, హంబొల్డ్ పార్క్ సహా ఇతర ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు జరిగినట్లు మీడియా తెలిపింది. ఈ ఘటనల్లో చిన్న పిల్లల నుంచి 62 ఏళ్ల మహిళ వరకు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. మరో మీడియా 8 మంది మరణించగా.. 42 మంది గాయపడినట్లు తెలిపింది.
అమెరికాలో తుపాకీ హింస ఇటీవల పెరిగింది. ఎప్పుడు ఎక్కడ గన్ పేలుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. 2022లోనే ఇప్పటి వరకు 140 మాస్ సూటింగ్స్ జరిగినట్లు తుపాకీ హింసాత్మక ఘటన లెక్కింపు సంస్థ తెలిపింది. 7,500 సోర్సుల నుంచి సేకరించిన డేటా ప్రకారం ఈ వివరాలు నమోదు చేసినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: పార్లమెంటులో పోర్న్ షో.. అధికార పక్ష ఎంపీ రాజీనామా