నేపాల్‌లో విమానం కూలి 70 మంది మరణించన ఘటన మరవకముందే మరో ప్రమాదం జరిగింది. అమెరికాలోని టెక్సాస్‌లో ఓ చిన్న సైజు విమానం కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ప్రమాదం సమయంలో విమానంలో ఐదుగురు ఉన్నారని.. నలుగురు మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలు కావడం వల్ల ఆస్పత్రికి తరలించారు. టెక్సాస్ విమానాశ్రానికి చేరుకుంటున్న క్రమంలో విమానం క్రాష్ అయినట్లు అధికారులు వెల్లడించారు.
బుధవారం ఉదయం విక్టోరియా యోకుమ్కు కేవలం ఒకమైలు దూరంలో ఈ ప్రమాదం జరిగింది. వీరంతా జర్మన్‌టౌన్‌లోని మెంఫిస్ శివారులో ఉన్న ఓ చర్చికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఈ విమాన ప్రమాదం నుంచి చర్చి ప్రధాన పాస్టర్ కెన్నన్ వాఘన్ గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడుతున్నట్లు సంబంధిత అధికార సిబ్బంది తెలిపారు. మృతులు బిల్ గార్నర్, స్టీవ్ టక్కర్, టైలర్ ప్యాటర్సన్, టైలర్ స్ప్రింగర్లుగా ఆ చర్చి అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది.