ETV Bharat / international

వరుణుడి బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 17 మంది దుర్మరణం - nepal landslides

పొరుగు దేశం నేపాల్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సుదర్‌పశ్చిమ్‌ , అచ్ఛం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 17 మంది దుర్మరణం చెందారు.

nepal landslide
nepal landslideBharat
author img

By

Published : Sep 17, 2022, 9:07 PM IST

Nepal LandSlides : నేపాల్‌లోని అచ్చాం, సుదూర్‌పశ్చిమ్‌ జిల్లాల్లో కుండపోత వర్షాలకు కొండచరియలు విరిగిపడి 17 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రకృతి భీభత్సానికి అక్కడి రహదార్లు పూర్తిగా ధ్వంసమవ్వడంతో గాయపడ్డ మరో 11మందిని వాయుమార్గంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ దుర్ఘటనలో మరణాల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉండవచ్చని అధికారులు వెల్లడించారు. ప్రతి ఏటా అక్కడ కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

లష్కరే తోయిబా ఉగ్రవాదికి అండగా చైనా.. భారత్​, అమెరికా ప్రయత్నాలకు అడ్డుపుల్ల

బ్రిటన్​ రాణి అంత్యక్రియలకు రిహార్సల్స్​.. లండన్​కు బయల్దేరిన రాష్ట్రపతి ముర్ము

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.