ETV Bharat / international

ఆఫ్రికాలో పేలిన బాంబు.. 10 మంది మృతి.. పలువురికి గాయాలు - బుర్కినా ఫాసో బస్సు పేలుడు

ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 10 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.

several civilians killed in roadside bomb
బాంబు పేలుడు
author img

By

Published : Dec 27, 2022, 8:16 AM IST

Updated : Dec 27, 2022, 9:14 AM IST

ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం బౌగురు గ్రామంలో గుండా ప్రయాణిస్తున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి ఓ మైనింగ్​ గనిని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సహాయ చర్యలు చేపట్టిన సిబ్బంది క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు గల్లంతయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతలను కట్టుదిట్టం చేసి.. గల్లంతైన ప్రయాణికుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు బుర్కినా ప్రభుత్వం తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు తెలిపారు. శనివారం కూడా ఔగరా, మటియాకోలీ ప్రాంతాల్లో ఓ బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు సైనికులు మృతిచెందారు.

అల్​-ఖైదా-ఇస్లామిక్ స్టేట్‌ మధ్య ఘర్షణల కారణంగా బుర్కినా ఫాసోలో రోజురోజుకి హింస పెరుగుతోంది. దీంతో వేలాది మంది అమాయక పౌరులు మరణిస్తున్నారు. ఆరు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ దాడుల్లో.. లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. మరోవైపు.. దేశంలోని హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజాసంఘాలు ఆరోపించాయి.

Last Updated : Dec 27, 2022, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.