ETV Bharat / international

ఉక్రెయిన్ మందుగుండు స్థావరంపై రష్యా వైమానిక దళం దాడి - రష్యా ఉక్రెయిన్​

Russia Ukraine News: ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దళాలు విరుచుకుపడ్డాయి. వైమానిక దళం జరిపిన దాడుల్లో మందుగుండు స్థావరంసహా ఉక్రెయిన్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఖార్కివ్‌ పైనా ఫిరంగులు, మోర్టార్‌లు, రాకెట్‌ లాంచర్లతో దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది. రష్యా బలగాల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో దారుణమైన యుద్ధ నేరాలు బయటపడుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 19వేల 100మంది మాస్కో సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది.

russia-ukraine-war-news
ఉక్రెయిన్ మందుగుండు స్థావరంపై రష్యా వైమానిక దళం దాడి
author img

By

Published : Apr 9, 2022, 10:30 PM IST

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దాడులపర్వం కొనసాగుతోంది. మధ్య ఉక్రెయిన్‌ మిర్‌హోరోద్‌ ఎయిర్ బేస్‌లోని మందుగుండు సామగ్రి డిపోను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. పోల్తావా రీజియన్‌లోని స్థావరంపై జరిపిన ఈ దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన మిగ్ -29 యుద్ధవిమానం, ఎంఐ -8 హెలికాప్టర్‌నూ కూల్చినట్లు.... రష్యా రక్షణ శాఖ పేర్కొంది. ఖార్కివ్‌ నగరంపైనా దాడులు కొనసాగినట్లు ఆ ప్రాంత సైనిక పాలనాధికారి తెలిపారు. ఫిరంగులు, మోర్టార్‌లు, యుద్ధ ట్యాంకులు, రాకెట్‌ లాంచర్లతో దాదాపు 50వరకు దాడులు జరిపినట్లు చెప్పారు. రష్యా బలగాల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నప్రాంతాల్లో దారుణమైన యుద్ధనేరాలు బయటపడుతున్నట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది. కీవ్‌ రీజియన్‌లోని మకరీవ్‌ పట్టణంలో 132 మృతదేహాలు బయటపడగా వారిని క్రూరంగా హింసించి హత్య చేసినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పేర్కొంది.

Russia attack Ukraine: మరోవైపు క్రమాటెర్స్క్‌ రైల్వేస్టేషన్‌పై దాడి ఘటన తరహాలోనే నిరాయుధులపై మాస్కో దాడులు కొనసాగిస్తోందని బ్రిటన్‌ ఇంటెలిజెన్స్‌ రిపోర్టు పేర్కొంది. రష్యా దళాలు క్షిపణులతో డాన్‌బాస్, మేరియుపొల్‌, మైకోలైవ్‌లపై దాడులు చేయటంపై దృష్టి సారించినట్లు చెప్పింది. రష్యా దాడులు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 176 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం తెలిపింది. లుహాన్స్క్‌ రీజియన్‌పై దాడులు పెరగడంతో...సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అక్కడి గవర్నర్‌ ప్రజలకు సూచించారు. 10 మానవతా కారిడార్లు ఏర్పాటు చేసినట్లు ఉక్రెయిన్‌ ఉప ప్రధాని తెలిపారు.

యుద్ధంలో 19వేల 100 మంది మాస్కో సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. 705 యుద్ధ ట్యాంకులు, 1895 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 151 యుద్ధ విమానాలు, 136 హెలికాప్టర్లు, 112యూఏవీలను కూల్చినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు ఉక్రెయిన్‌ నుంచి ఇతర దేశాలకు తరలివెళ్లినవారి సంఖ్య 44 లక్షలు దాటిందని ఐరాస శరణార్థుల ఏజెన్సీ వెల్లడించింది. మరో 71లక్షల మంది నిరాశ్రయులయ్యారని తెలిపింది. శరణార్థుల సంక్షోభం అత్యంతవేగంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: 'ఇమ్రాన్ ఖాన్​ ఓ సైకో​.. అతడికి భారత్ నచ్చితే అక్కడికే వెళ్లాలి'

కీవ్​లో బోరిస్ ఆకస్మిక పర్యటన​.. ఆయుధాలిస్తామని జెలెన్​స్కీకి హామీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.