ETV Bharat / international

'కీవ్​పై క్షిపణుల వర్షం'.. ఉక్రెయిన్​కు రష్యా వార్నింగ్ - రష్యా ఉక్రెయిన్ యుద్ధం

Russia Ukraine War ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం కీలక మలుపు తీసుకుంది. రష్యా దాడుల్ని నిలువరిస్తూ వస్తోన్న ఉక్రెయిన్‌ సేనలు ప్రతిదాడులకు తెగబడుతున్నాయి. కీలక యుద్ధ నౌక మస్క్‌వా ధ్వంసంతో పాటు రష్యా గ్రామాలపై ఉక్రెయిన్‌ సేనలు దాడులకు తెగబడినట్లు వార్తలు వ‌చ్చాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రష్యా.. ఉక్రెయిన్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించింది. రాజధాని కీవ్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తామని రష్యా రక్షణశాఖ ప్రకటించింది. రష్యా ప్రకటనకు అనుగుణంగానే కీవ్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి.

Russia  Ukraine War
ఉక్రెయిన్​కు రష్యా తీవ్ర హెచ్చరికలు.. కీవ్​పై క్షిపణుల వర్షం!
author img

By

Published : Apr 15, 2022, 5:39 PM IST

Russia Ukraine News: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై క్షిపణి దాడులను తీవ్రతరం చేయనున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యా భూభాగంపై ఉక్రెయిన్ దాడులకు స్పందనగా కీవ్​పై క్షిపణుల వర్షం కురిపిస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో కీవ్‌లో శక్తిమంతమైన పేలుళ్లు సంభవించాయి. నగరంలో ఒకదాని తర్వాత ఒకటిగా.. మొత్తం మూడు పేలుళ్లు జరిగినట్లు స్థానిక ఎంపీ లెసియా వాసిలెంకో తెలిపారు. నగరంపై వైమానిక దాడి హెచ్చరిక ఒక గంటపాటు కొనసాగిందని ఎంపీ తెలిపారు.

ఈ నెల ప్రారంభంలోనే కీవ్ నుంచి బలగాలను ఉపసంహరిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. కానీ ఉక్రెయిన్‌ దాడి చేస్తోందన్న ఆరోపణలతో తిరిగి కీవ్‌పై విధ్వంసం సృష్టించేందుకు మాస్కో సేనలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా కీవ్‌ శివార్లలోని మిలటరీ ఫ్యాక్టరీ మీద క్షిపణి దాడులతో విరుచుకుపడినట్లు రష్యా రక్షణశాఖ ప్రకటించింది. అలాగే మరియూపోల్​లోని ఇలిచ్‌ స్టీల్‌ ప్లాంట్‌పై పూర్తి ఆధిపత్యం సాధించినట్లు పేర్కొంది. దక్షిణ నగరం ఖెర్సన్ లోనూ.. పేలుళ్లు సంభవించినట్లు ఉక్రెయిన్ మీడియా చెప్పింది.

Russia Missile Attack: యుద్ధ నౌకను, రష్యా గ్రామాలను ఉక్రెయిన్‌ ధ్వంసం చేసిందన్న ఆరోపణలతో తిరిగి కీవ్‌పై రష్యా దృష్టిసారించింది. ఉక్రెయిన్‌తో సరిహద్దు కలిగిన రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలోని క్లిమోవో గ్రామంపై ఉక్రెయిన్ సైన్యం దాడి చేసినట్లు రష్యా ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ దళాలు చేసిన దాడిలో వందకుపైగా నివాస భవనాలు దెబ్బతిన్నట్లు రష్యా తెలిపింది. ఏడుగురు పౌరులకు గాయాలైనట్లు వెల్లడించింది. బ్రయాన్స్క్ ప్రాంతంపై దాడికి దిగిన ఉక్రెయిన్​కు చెందిన Mi-8 హెలికాప్టర్​ను కూల్చినట్లు రష్యా ప్రకటించింది. తమ దేశంలో ఉక్రెయిన్‌తో సరిహద్దు కలిగిన మరో ప్రాంతం బెల్గోరోడ్​పై కూడా ఉక్రెయిన్ దళాలు ఫిరంగి దాడులకు దిగినట్లు రష్యా ఆరోపిస్తోంది. మరోవైపు గురువారం నల్ల సముద్రంలోని రష్యా యుద్ధ నౌక మిసైల్ క్రూయిజ్ మస్క్‌వాను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.

ఇదీ చదవండి: ఇజ్రాయెల్ పోలీసులకు, పాలస్తీనియన్లకు ఘర్షణ.. 152 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.