Cryptocurrency Russia: అంతర్జాతీయ చెల్లింపులకు క్రిప్టో కరెన్సీ వినియోగాన్ని అనుమతించే విషయంపై రష్యా పరిశీలిస్తున్నట్లు ఓ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ కథనంలో పేర్కొంది. అంతర్జాతీయ చెల్లింపు సెటిల్మెంట్లకు డిజిటల్ కరెన్సీలు వినియోగం ఆలోచనపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నట్లు రష్యా ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఫైనాన్షియల్ పాలసీ విభాగం అధిపతి ఇవాన్ చెబ్సకోవ్ పేర్కొన్నట్లు ఆ కథనంలో వెల్లడించింది. దేశంలోని క్రిప్టో కరెన్సీలను క్రమబద్ధీకరించడం, డిజిటల్ కరెన్సీల వినియోగంపై తీవ్ర చర్చజరుగుతోంది. అక్కడి సెంట్రల్ బ్యాంక్ క్రిప్టోలపై పూర్తిస్థాయి నిషేధం విధించాలన్న సిఫార్సును ఆర్థిక శాఖ వ్యతిరేకిస్తోంది.
క్రిప్టో కరెన్సీలను ఆమెదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నా.. ఇప్పటి వరకు ఓ నిర్ణయానికి రాలేదు. తాజాగా ఆ దేశ ఆర్థికశాఖ అంతర్జాతీయ చెల్లింపులకు వీటిని చేర్చే అంశంపై చర్చించింది. ఒక వేళ దీనికి ఆమోదముద్ర పడితే పశ్చిమదేశాల ఆంక్షల ప్రభావాన్ని రష్యా గణనీయంగా తగ్గించుకునే అవకాశాలున్నాయి. మార్చిలోనే రష్యా కాంగ్రెషనల్ కమిటీ ఛైర్మన్ పావెల్ జవాల్ని మాట్లాడుతూ సహజవనరుల ఎగుమతుల కోసం బిట్‌కాయిన్లలో చెల్లింపులను ఆమోదిస్తామని తెలిపారు. కేవలం మిత్రదేశాలైన టర్కీ వంటి వాటికి మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుందన్నారు. అంతకు ముందురోజు స్నేహపూర్వకంగా లేని దేశాలు రష్యా గ్యాస్ కోసం రూబుల్స్‌లో మాత్రమే చెల్లింపులు చేయాలని పుతిన్ ప్రకటించారు.
ఇవీ చదవండి: భారీ పేలుడు శబ్దం.. విమానం మాయం.. 22 మంది పరిస్థితి?