ETV Bharat / international

చర్చలు సక్సెస్.. కీవ్​ నుంచి రష్యా వాపస్.. యుద్ధం ముగిసినట్టేనా?

author img

By

Published : Mar 29, 2022, 6:02 PM IST

Updated : Mar 29, 2022, 6:54 PM IST

Ukraine Russia war end: రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని సహా కీలక నగరాల్లో సైన్యాన్ని తగ్గిస్తామని రష్యా ప్రకటించింది.

Russia military
Russia military

Ukraine Russia war end: రష్యా-ఉక్రెయిన్​ మధ్య టర్కీలోని ఇస్తాంబుల్​లో జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగాయి. యుద్ధం ముగింపు దిశగా అడుగులు వేసేలా రెండు దేశాల మధ్య కీలక ఏకాభిప్రాయం కుదిరింది. రాజధాని కీవ్ సహా మరో ప్రధాన నగరమైన చెర్నిహివ్​లో సైన్యాన్ని తగ్గిస్తామని రష్యా ప్రకటించింది.

అంతకుముందు జరిగిన కొన్ని ముఖాముఖి చర్చలు విఫలమైన నేపథ్యంలో శాంతి చర్చలపై ఉక్రెయిన్​కు మరింత భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ సహాయ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ తెలిపారు. ఇస్తాంబుల్ చర్చల తర్వాత.. పుతిన్, జెలెన్​స్కీ సమావేశం అయ్యే అవకాశం ఉందని ఉక్రెయిన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య యుద్ధం ముగింపు, ఉక్రెయిన్ భద్రత వంటి అంశాలే లక్ష్యంగా ఇస్తాంబుల్​లో చర్చలు జరిగినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు వివరించారు.

ఉక్రెయిన్- రష్యా మధ్య చర్చలు ఫలప్రదంగా సాగడం వల్ల చమురు సరఫరాపై ఉన్న భయాలు వీడాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర 5శాతానికిపైగా తగ్గింది. మరోవైపు రష్యా కరెన్సీ రూబెల్ విలువ 10శాతం మేర పెరిగింది.

ఇవీ చూడండి: 'అధ్యక్షుడిని అంతమొందించడమే వారి లక్ష్యం'

ఉక్రెయిన్​పై దాడులు చేస్తూనే.. మరోవైపు చర్చలకు రష్యా సన్నద్ధం!

Last Updated : Mar 29, 2022, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.