ETV Bharat / international

విద్యుత్‌ కేంద్రాలే రష్యా టార్గెట్‌.. లక్షల మంది ఉక్రెయిన్‌ ప్రజలు అంధకారంలోనే - ఉక్రెయిన్​ విద్యుత్​ కేంద్రాలు

రష్యా జరుపుతున్న దాడుల్లో ఉక్రెయిన్​లోని మూడో వంతు విద్యుత్కేంద్రాలు ధ్వంసమయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా లక్షల మంది ప్రజలు విద్యుత్​ సరఫరా లేక బిక్కుబిక్కుమంటూ అంధకారంలోనే గడుపుతున్నారు.

ukraine
ukraine
author img

By

Published : Oct 19, 2022, 6:34 AM IST

Ukraine Power Stations Attack: ఉక్రెయిన్‌పై దాడుల తీవ్రతను రష్యా రోజురోజుకూ మరింత పెంచుతోంది. ఆ దేశ రాజధాని కీవ్‌ సహా పలు నగరాలపై క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ప్రధానంగా విద్యుత్కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటోంది. గత వారం రోజుల్లోనే పుతిన్‌ బలగాలు ఉక్రెయిన్‌లోని మూడో వంతు విద్యుత్కేంద్రాలను ధ్వంసం చేశాయి. దీంతో దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు విద్యుత్‌ సరఫరా లేక బిక్కుబిక్కుమంటూ అంధకారంలో గడుపుతున్నారు. రష్యా దాడుల కారణంగా పలు ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింది. అనేక పరిశ్రమలు, సైనిక స్థావరాలకు నెలవైన జైటమిర్‌ నగరమూ ఈ జాబితాలో ఉంది.

.

దేశంలో చలి క్రమంగా పెరుగుతున్న వేళ ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేందుకు రష్యా ఉద్దేశపూర్వకంగానే విద్యుత్కేంద్రాలను ధ్వంసం చేస్తోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కీవ్‌పై పుతిన్‌ సేన మంగళవారం జరిపిన క్షిపణి దాడుల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో రష్యాతో శాంతి చర్చలు జరిపేందుకు ఆస్కారమే లేకుండా పోయిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. మరోవైపు- ఇరాన్‌తో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వద్ద ఆ దేశ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేెబా మంగళవారం ప్రతిపాదించారు. రష్యాకు ఇరాన్‌ ఆత్మాహుతి డ్రోన్లను సమకూర్చిందని, వాటితో పుతిన్‌ సేన తమ దేశంలో విధ్వంసం సృష్టిస్తోందని కొన్నిరోజులుగా ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కులేెబా తాజా ప్రతిపాదన చేశారు.

రష్యాలో కూలిన యుద్ధవిమానం..
రష్యాలోని యెయ్స్క్‌ అనే తీరప్రాంత నగరంలో పుతిన్‌ సేనకు చెందిన ఓ యుద్ధవిమానం కూలిపోయింది. శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఎస్‌యూ-34 బాంబర్‌ సోమవారం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే.. దానిలోని ఓ ఇంజిన్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో అందులోని సిబ్బంది సురక్షితంగా బయటకు దూకారు. అనంతరం యుద్ధవిమానం యెయ్స్క్‌లోని ఓ నివాస ప్రాంతంలో కూలింది. టన్నులకొద్దీ ఇంధనం ఉండటంతో అది పేలిపోయి స్థానికంగా పలు భవనాలకు మంటలు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 15 మంది మృత్యువాతపడ్డారు.

ఇవీ చదవండి: చైనా పైలట్లుకు బ్రిటన్​ మాజీల శిక్షణ! భారీ ప్యాకేజీలు ఇస్తున్న డ్రాగన్​

తప్పులు చేశాం.. క్షమించండి : బ్రిటన్ ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.