ETV Bharat / international

రిపబ్లిక్​డే వేడుకలకు బైడెన్​ రాకపోవచ్చేమో!- క్వాడ్ సదస్సు కూడా క్యాన్సిల్!!

Republic Day 2024 Chief Guest Biden : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో పర్యటించకపోవచ్చని సమాచారం. భారత గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది.

republic day 2024 chief guest
republic day 2024 chief guest
author img

By PTI

Published : Dec 12, 2023, 8:36 PM IST

Republic Day 2024 Chief Guest Biden : వచ్చే ఏడాది జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. కొద్దినెలల క్రితం జీ20 సదస్సు సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా బైడెన్‌తో ప్రధాని మోదీ మాట్లాడారని, గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా అధ్యక్షుడిని ఆహ్వానించారని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి గతంలో వెల్లడించారు.

క్వాడ్​ సదస్సు వాయిదా తప్పదా?
Quad Summit 2024 Held In Which Country : అలాగే భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్‌ సదస్సుకు వచ్చే ఏడాది భారత్​ ఆతిథ్యం ఇవ్వనుందనే ప్రతిపాదన ఉంది. దీనిపై కూడా అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. బైడెన్‌ ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా వస్తే ఆ తర్వాతి రోజు (జనవరి 27న) క్వాడ్‌ సదస్సును నిర్వహించొచ్చనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు బైడెన్ పర్యటన ఉండకపోవచ్చనే వార్తలతో క్వాడ్ సదస్సు కూడా వాయిదా పడనున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు రిపబ్లిక్ డేకు హాజరైన అతిథులు వీరే
Republic Day Chief Guest List : 1950 నుంచి భారత్‌ తన మిత్ర దేశాల నేతలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తోంది. 1952, 53, 66ల్లో మాత్రమే విదేశీ అతిథులు లేకుండా రిపబ్లిక్‌డే వేడుకలు నిర్వహించారు. 2007లో పుతిన్‌(రష్యా), 2008లో నికోలస్‌ సర్కోజీ(ఫ్రాన్స్‌), 2015లో బరాక్‌ ఒబామా (అమెరికా), 2016లో హోలన్‌ (ఫ్రాన్స్‌)లు అతిథులుగా హాజరయ్యారు.

2021లో నాటి బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను చీఫ్‌ గెస్ట్‌గా ఆహ్వానించారు. కానీ, కొవిడ్‌ కేసులు పెరగడం వల్ల ఆయన పర్యటన రద్దైంది. 2018లో ఆసియాన్‌ దేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవానికి ఆహ్వానించారు. 2023లో ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా అల్‌సీసీ హాజరయ్యారు. ఇక వచ్చే ఏడాది బైడెన్‌ హాజరుపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు బైడెన్ గణతంత్ర ఉత్సవాలకు వస్తే ఇప్పటివరకు చీఫ్ గెస్ట్​గా విచ్చేసిన రెండో అమెరికా అధ్యక్షుడిగా ఆయన నిలుస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.