ETV Bharat / international

Qatar Navy Case : భారత నేవీ మాజీ అధికారులకు మరణశిక్ష.. ఖతార్ కోర్టు సంచలన తీర్పు

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2023, 7:01 PM IST

Updated : Oct 26, 2023, 7:37 PM IST

Qatar Navy Case : భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులకు మరణశిక్ష విధించింది ఖతార్‌ కోర్టు. గత కొన్ని నెలలుగా ఖతార్‌ నిర్బంధంలో ఉన్న వీరికి తాజాగా అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది.

qatar navy case
qatar navy case

Qatar Navy Case : గూడఛార ఆరోపణలతో భారత నావికాదళ మాజీ అధికారులకు ఖతార్‌ కోర్టు మరణశిక్ష విధించింది. ఒకప్పుడు భారత ప్రధాన యుద్ధనౌకల్లో పనిచేసిన అధికారి సహా 8 మందికి ఖతార్‌ న్యాయస్థానం మరణ దండన విధించింది. వారి బెయిల్‌ పిటిషన్లను ఇప్పటికే అనేక సార్లు ఖతార్‌ అధికారులు తిరస్కరించి నిర్బంధాన్ని పొడిగించారు. తాజాగా ఖతార్ కోర్టు 8 మందికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

Indian Navy Officers In Qatar Jail : మరోవైపు, భారత మాజీ నావికాదళ అధికారులకు ఖతార్‌ కోర్టు మరణదండన విధించడంపై భారత విదేశాంగ శాఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పూర్తిస్థాయి తీర్పు వివరాల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. న్యాయపరమైన అన్ని ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నట్లు వివరించింది. వారి కుటుంబ సభ్యులతో సంప్రదిస్తున్నట్లు వెల్లడించింది. మాజీ నేవీ అధికారులకు అన్నిరకాలుగా దౌత్యపరమైన, న్యాయపరమైన సాయం కొనసాగిస్తామని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. గోప్యతకు సంబంధించిన కారణాల దృష్ట్యా ఈ కేసుపై ప్రస్తుతం ఎక్కువగా వ్యాఖ్యానించలేమని వివరించింది. ఈ కేసుకు అధిక ప్రాధాన్యం దృష్ట్యా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని.. ఖతార్‌ అధికారుల వద్దకు ఈ విషయాన్ని తీసుకుని వెళతామని పేర్కొంది. మాజీ నావికాదళ అధికారులను ఖతార్ అరెస్ట్ చేయడంలో పాకిస్థాన్ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే..?
Indian Navy Officers Detained In Qatar : భారత్‌కు చెందిన 8 మంది నౌకాదళ మాజీ అధికారులు ఖతార్​లోని అల్‌ దహ్రా సంస్థలో పనిచేస్తున్నారు. ఖతార్‌ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్‌కు చెందిన ఓ మాజీ వైమానిక దళం అధికారి నిర్వహిస్తున్నారు. అయితే, భారత్‌కు చెందిన ఈ 8 మందిని ఖతార్‌ అధికారులు 2022 ఆగస్టులో నిర్బంధంలోకి తీసుకున్నారు. సబ్‌మెరైన్‌ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని నిర్బంధించినట్లు తెలిసింది. అయితే, వీరందరికి భారత అధికారులతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. దీంతో భారత విదేశాంగ శాఖ అధికారులు బాధితులతో పాటు ఖతార్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి.. వారిని రక్షించేందుకు ప్రయత్నించింది. చివరకు ఈ కేసు కోర్టులో విచారణకు వెళ్లగా.. తాజాగా ఎనిమిది మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది ఖతార్​ న్యాయస్థానం.

Man Sentenced To 240 Years In Prison: భార్య సహా ఇద్దరు హత్య.. 240 ఏళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు

Israel Iron Sting : ఇజ్రాయెల్‌ 'ఐరన్‌ స్టింగ్‌'.. ఒకే రౌండ్‌తో లక్ష్యాలన్నీ ధ్వంసం!

Last Updated : Oct 26, 2023, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.