ETV Bharat / international

'పుతిన్​కు క్యాన్సర్​.. ఎర్ర జింక కొమ్ముల రసంతో స్నానం ద్వారా చికిత్స!'.. నిజమెంత?

రష్యా అధ్యక్షుడు పుతిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారా? గత కొన్నేళ్లలో పలుమార్లు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడానికి క్యాన్సర్‌కు చికిత్సే కారణమా? రష్యాకు చెందిన పరిశోధనాత్మక మీడియా సంస్థ 'ప్రొయెక్ట్' ప్రచురించిన కథనం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ వార్తను తోసిపుచ్చింది క్రెమ్లిన్‌. అవన్నీ అసత్య ప్రచారాలని, పుతిన్‌ ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసింది.

putin health condition
'పుతిన్​కు క్యాన్సర్​.. ఎర్ర జింక కొమ్ముల రసంతో స్నానం ద్వారా చికిత్స!'.. నిజమెంత?
author img

By

Published : Apr 2, 2022, 12:11 PM IST

Putin health condition: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారనే వార్తలు వైరల్‌గా మారాయి. రష్యాకు చెందిన పరిశోధనాత్మక మీడియా సంస్థ ప్రొయెక్ట్.. ఈ కథనాన్ని ప్రచురించింది. 2016 నుంచి పుతిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, దానికి చికిత్స చేయించుకునేందుకే కొన్నిసార్లు అజ్ఞాతంలోకి వెళ్లారని తెలిపింది. అధ్యక్ష కార్యాలయ సర్జన్‌ తరచూ నల్ల సముద్రంలోని పుతిన్ నివాసానికి సందర్శించేవారని పేర్కొంది. 2016 నుంచి 2019 వరకు థైరాయిడ్ క్యాన్సర్‌ సర్జన్‌తోపాటు చాలామంది వైద్యులు నగరంలోని పుతిన్ నివాసానికి వెళ్లినట్లు తెలిపింది. పుతిన్ అధికారిక సందర్శనల తేదీలను, ఆయన కనిపించకుండా పోయిన రోజులు, స్థానిక హోటల్‌లో బస చేసిన వివరాలను ప్రొయెక్ట్ వెల్లడించింది. పుతిన్ రాజకీయాల్లో గత 23 ఏళ్లుగా ఉన్నా ఆయన ఆరోగ్య, మానసిక పరిస్థితి పట్ల ప్రజలకు ఎలాంటి విషయం తెలియదని పేర్కొంది. అయితే ప్రస్తుతం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన అనారోగ్యంతో ఉన్నట్లు ప్రొయెక్ట్ ఎడిటర్ రోమన్ బడానిన్ తెలిపారు.

Putin health secrets: ప్రొయెక్ట్‌ అనేది ఒక స్వతంత్ర రష్యన్‌ మీడియా. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో భాగంగా వార్తలు ప్రచురించినందుకు ఆ సంస్థపై ప్రభుత్వం నిషేధం విధించింది. 2016 నవంబరులో అధ్యక్ష ఆస్పత్రి వైద్యుల బృందం పుతిన్‌కు శస్త్రచికిత్స చేసి ఉండవచ్చని ప్రొయెక్ట్ కథనం తెలిపింది. ఈ వైద్యబృందంలో ఇద్దరు, ముగ్గురికి అవార్డులు, పదోన్నతులు లభించినట్లు వెల్లడించింది. 2016 నుంచి 2019 వరకు థైరాయిడ్ క్యాన్సర్‌ స్పెషలిస్టులు 166 రోజులు సోచి నగరంలోని పుతిన్‌ నివాసంలో గడిపినట్లు రికార్డుల్లో ఉందని ప్రొయెక్ట్‌ ఎడిటర్‌ తెలిపారు. అయితే పుతిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారా లేక ఇతర అనారోగ్యంతో ఉన్నారా అనే విషయాన్ని ప్రొయెక్ట్ నేరుగా ప్రస్తావించలేదు. చికిత్సలో భాగంగా ఎర్ర జింక కొమ్ముల నుంచి తీసిన రసంతో పుతిన్‌ స్నానం చేయాలని వైద్యులు సూచించినట్లు వెలువరించింది. అయితే.. పుతిన్ ఆరోగ్యంపై ప్రొయెక్ట్ కథనాన్ని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ కొట్టిపారేశారు. పుతిన్.. థైరాయిడ్‌ సంబంధిత క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నారనే వార్తలన్నీ ఒక అభూత కల్పన, అబద్ధమని కొట్టిపారేశారు.

ఇదీ చదవండి: ప్రతి మూడేళ్లకు విడాకులు, మళ్లీ పెళ్లి.. ఆ జంట వెరైటీ 'రాజీ' ఫార్ములా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.