ETV Bharat / international

ఫ్రాన్స్​లోనూ UPI.. రూపాయల్లో డిజిటల్ చెల్లింపులు.. మోదీకి అరుదైన పురస్కారం - emmanuel macron modi

PM Modi France Visit : భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకని ప్రధాని మోదీ అన్నారు. ఈ వైవిధ్యమే భారత ప్రజాస్వామ్యానికి అతిపెద్ద బలంగా అభివర్ణించారు. ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న మోదీ.. ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్రాన్స్ గడ్డపై ప్రాణాలు విడిచిన.. భారతీయ సైనికులకు ప్రధాని నివాళులు అర్పించారు. భారత్‌ వృద్ధిపథంలో దూసుకుపోతుందన్న మోదీ.. 25 ఏళ్లల్లో అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తామన్నారు.

pm modi france visit
pm modi france visit
author img

By

Published : Jul 14, 2023, 7:17 AM IST

PM Modi France Visit : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అత్యున్నత పురస్కారం లభించింది. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న.. ఆయనను ఆ దేశ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్​ క్రాస్​ ఆఫ్​ ది లిజియాన్​ ఆఫ్ హానర్​ను ఇచ్చి గౌరవించింది. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌.. ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు. ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిన భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని.. ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న ఆయన.. ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. భారీగా తరలివచ్చిన ప్రవాసీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. భారత వేగవంతమైన అభివృద్ధిని వారికి వివరించారు.

pm modi france visit
మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న ఆ దేశ అధ్యక్షుడు

భారత్‌లో అత్యంత విజయవంతమైన డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ UPIను.. ఇక ఫ్రాన్స్‌లో ఉపయోగించుకోవచ్చని మోదీ ప్రకటించారు. భారత్‌- ఫ్రాన్స్ UPIని ఉపయోగించడానికి అంగీకరించాయని ఆయన తెలిపారు. త్వరలో ఈఫిల్‌ టవర్ నుంచి ఫ్రాన్స్‌లో యూపీఐ సేవలను ప్రారంభిస్తామని ప్రకటించారు. ఫ్రాన్స్‌లో పర్యటించే భారతీయ పర్యటకులు ఇక రూపాయాల్లోనూ డిజిటల్‌ పేమెంట్స్‌ చేయవచ్చంటూ మోదీ ప్రకటించారు. నగదు రహిత తక్షణ చెల్లింపులో ఇదీ భారీ ఆవిష్కరణగా పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత బలం, పాత్ర పెరుగుతోందన్న ప్రధాని.. జీ20కి అధ్యక్షత వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. తొమ్మిదేళ్లలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని గుర్తు చేశారు. భారత్‌-ఫ్రాన్స్ భాగస్వామ్యానికి ప్రజలే అనుసంధానకర్తలన్న ప్రధాని.. ప్రవాసీయులు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రపంచ ఆర్థిక నిపుణులు భారత్‌ను పెట్టుబడులకు గమ్యస్థానంగా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.

"రానున్న 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యంతో భారత్ కృషి చేస్తోంది. ఇందులో మీ (ప్రవాస భారతీయులు) పాత్ర చాలా కీలకం. భారత్‌ అభివృద్ధి చెందుతోందని, ఒక ప్రకాశవంతమైన ప్రదేశమని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. పెట్టుబడులకు భారత్‌లో విస్తారమైన అవకాశాలు ఉన్నాయి. మీరు భారత్‌లో పెట్టుబడులు పెట్టండి. విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు సౌకర్యాలు కల్పించేందుకు, వారిని రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉక్రెయిన్ అయినా.. సుడాన్‌ అయినా.. యెమెన్‌ అయినా అఫ్గానిస్ధాన్‌ అయినా ఇరాక్‌ అయినా.. నేపాల్‌ అయినా భారతీయులను రక్షించడానికి మేము ఎల్లప్పుడూ ముందుకు వస్తాం. భారత్‌లో ఉన్న పౌరులు మాకు ఎంత ముఖ్యమో, విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు మాకు అంతే ముఖ్యం."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

'మీ మనసు మాత్రం భారత్​లోనే'
ప్రవాస భారతీయలను భారత రాయబారులుగా అభివర్ణించిన మోదీ.. భారత్‌లో పర్యాటక రంగం పురోగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో ప్రవాసీయులు ఎక్కడ ఉన్నా.. వారి మనసు మాత్రం భారత్‌లోనే ఉంటుందన్నారు.

  • #WATCH | Cultural performances by the Indian diaspora at the La Seine Musicale in Paris ahead of the arrival of Prime Minister Narendra Modi here.

    PM Modi will address an Indian Community event here at around 11 PM IST today. pic.twitter.com/KPE6RT7MVx

    — ANI (@ANI) July 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నేను మీతో మాట్లాడుతున్న ఈ సమయంలో భారత్‌లో చంద్రయాన్‌ 3ను ప్రయోగించేందుకు రివర్స్‌ కౌంటింగ్‌ ప్రతిధ్వని వినిపిస్తోంది. కొన్ని గంటల తర్వాత, భారత్‌లోని శ్రీహరికోట నుంచి చరిత్రాత్మక చంద్రయాన్-3ని ప్రయోగించబోతున్నాం. ఈ ప్రపంచంలో భారతీయులు ఎక్కడ ఉన్నా వారి గుండె భారత్‌ కోసమే కొట్టుకుంటుంది. నేను స్పేస్‌ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరందరూ చంద్రయాన్‌, చంద్రయాన్‌ అని అరుస్తున్నారు. దానర్థం ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నారు. కానీ మీ మనసు మాత్రం చంద్రయాన్ మీద ఉంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

Emmanuel Macron Modi : సమావేశం అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ఇచ్చిన ప్రైవేట్‌ విందుకు మోదీ హాజరయ్యారు. పారిస్‌లోని ఫ్రాన్స్‌ అధ్యక్షుడి అధికారిక భవనం ఎలీసీ ప్యాలెస్‌కు చేరుకున్న ప్రధానికి.. మేక్రాన్, ప్రథమ మహిళ బ్రిగిట్టే మేక్రాన్‌లు స్వాగతం పలికారు. అంతకుముందు ఆ దేశ ప్రధానమంత్రి ఎలిజబెత్ బోర్న్‌తో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. వాణిజ్యం, ఇంధనం, పర్యావరణం, విద్య, ఆర్థిక, రైల్వేలు, డిజిటల్ మౌలిక వసతుల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై.. ఇరువురు నేతలు చర్చించినట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది. అంతకుముందు ఫ్రాన్స్‌ సెనేట్ అధ్యక్షుడు గెరార్డ్ లర్చర్‌తోనూ మోదీ చర్చలు జరిపారు. అనేక రంగాల్లో భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య సంబంధాలను దృఢపర్చుకునేందుకు కలిసి పని చేయాలని ఇరువురు నాయకులు నిర్ణయించుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం వంటి అంశాలే ఇరు దేశాల మధ్య భాగస్వామ్యనానికి పునాదని ప్రధాని మోదీ గెరార్డ్ లర్చర్‌తో వ్యాఖ్యానించినట్లు విదేశంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

  • PM Narendra Modi today met Gerard Larcher, President of the French Senate. PM Modi highlighted the significance of our shared values of ‘Democracy, Freedom and Equality’, forming the foundation ethos of the India-France partnership. The discussions focused on a wide range of… https://t.co/Dmwjel4gwX pic.twitter.com/pGQvhJbZ74

  • #WATCH | Indian Army band enthral the audience at the La Seine Musicale in Paris, where PM Modi will address the Indian Community at around 11pm IST today. pic.twitter.com/PrTxFIkg8R

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.