ETV Bharat / international

7.6 తీవ్రతతో భారీ భూకంపం- సునామీ హెచ్చరికలు జారీ - philippines earthquake news

Philippines Earthquake Today 2023 : ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్​పై 7.6 గా నమోదైంది. ఈ క్రమంలోనే సునామీ హెచ్చరికలు సైతం జారీ చేశారు అధికారులు.

Philippines Earthquake Today 2023
Philippines Earthquake Today 2023
author img

By PTI

Published : Dec 2, 2023, 8:58 PM IST

Updated : Dec 2, 2023, 10:20 PM IST

Philippines Earthquake Today 2023 : ఫిలిప్పీన్స్‌లోని మిందానో ద్వీపకల్పాన్ని భారీ భూకంపం వణికించింది. రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. సముద్ర మట్టానికి 32 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సెస్మోలాజికల్‌ సెంటర్‌ (EMSC) ప్రకటించింది. శనివారం రాత్రి 8.07 గంటల సమయంలో ఈ భారీ భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

  • An earthquake with a magnitude of 7.4 on the Richter Scale hit Mindanao, Philippines at around 8:07 pm today: National Center for Seismology pic.twitter.com/QxVf6yR5B0

    — ANI (@ANI) December 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సునామీ హెచ్చరికలు జారీ
Philippines Tsunami Warning : ఈ పరిస్థితుల నేపథ్యంలో సునామీ సంభవించే అవకాశముందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ హెచ్చరించింది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. సుర్జియో డెల్ సుర్​, డావావో ఓరియంటల్ ప్రావిన్స్​ల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని.. పడవలను జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు సముద్రం లోపలికి వెళ్లొద్దని తెలిపింది.

గత నెలలోనే భారీ భూకంపం
Philippines Earthquake News : అంతకుముందు గత నెలలోనే దక్షిణ ఫిలిప్పీన్స్‌లో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దక్షిణ కొటబాటో, సారంగని, దావో ఆక్సిడెంటల్‌ ప్రావిన్సెస్‌ తదితర దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. భూకంప ప్రభావం వల్ల పలుచోట్ల రోడ్లు కుంగిపోయాయి. కొన్ని భవనాలు కుప్పకూలిపోగా.. మరికొన్ని చోట్ల గోడలు బీటలు వారాయి.

అందువల్లే తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు
Philippines Earthquake History : ఫిలిప్పీన్స్‌లో తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు సంభవిస్తుంటాయి. ఈ దేశం రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ప్రాంతంలో ఉన్న కారణంగా ఇలా జరుగుతాయి. రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ను సర్కమ్‌ పసిఫిక్‌ బెల్ట్‌ అని కూడా పిలుస్తారు. పసిఫిక్‌, ఇండియన్‌- ఆస్ట్రేలియన్‌, కోకస్‌, నాజ్కా, ఉత్తర అమెరికా ప్లేట్లతోపాటు టెక్టోనిక్‌ ప్లేట్ల సరిహద్దులో దాదాపు 40 వేల కిలోమీటర్ల పరిధిలో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతంలో క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నందు వల్ల తరచూ అవి విస్ఫోటనానికి గురై భూకంపాలు సంభవిస్తుంటాయి.

Philippines Typhoon: ఫిలిప్పీన్స్​లో తుపాను బీభత్సం.. 19 మంది మృతి

సునామీ వస్తోందన్న భయంతో కొండెక్కి 80 మంది మృతి

Last Updated : Dec 2, 2023, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.