ETV Bharat / international

కిరాతకం.. భార్యను చంపి.. వేడినీటి పాత్రలో వేసి ఉడకబెట్టి..! - వేడి నీటి పాత్రలో భార్యను ఉడికించిన భర్త వార్తలు

భార్యను దిండుతో ఊపిరాడకుండా చేసి చనిపోయేలా చేశాడు కిరాతకుడు. ఆ తర్వాత వేడినీటి పాత్రలో ఆమె మృతదేహాన్ని పడేసి ఉడకబెట్టాడు. తన పిల్లల ఎదుటే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతున్నారు. ఈ దారుణ ఘటన పాకిస్థాన్​లోని సింధ్​ ప్రావిన్స్​లో జరిగింది.

pakistani-man-boils-wife-in-cauldron-in-front-of-children

author img

By

Published : Jul 14, 2022, 10:37 PM IST

పాకిస్థాన్​లో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు ఓ భర్త. అంతటితో ఆగకుండా.. ఆమె మృతదేహాన్ని వేడి నీటి కడాయిలో పడేసి ఉడకబెట్టాడు. తన ఆరుగురు పిల్లల ముందే ఈ దారుణానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలి మృతదేహం చూసి చలించిపోయారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇదీ జరిగింది.. సింధ్ ప్రావిన్స్​లో ఆషిక్ అనే వ్యక్తి​ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. గుల్షన్-ఎ-ఇక్బాల్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వాచ్​మెన్​గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలోని ఓ గదిలో కుటుంబంతో ఉంటున్నాడు.

భార్యను చంపి.. ఆషిక్ ముగ్గురు పిల్లలతో పారిపోయాడు. అదే సమయంలో బాధితురాలి పెద్ద కుమార్తె పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలి మృతదేహం చూసి చలించిపోయారు. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మిగతా ముగ్గురు పిల్లలను పోలీసులు.. సంరక్షణా కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం వెతుకుతున్నారు. అయితే ఈ ఘటన వెనుక కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఆషిక్​ తన భార్యను అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని బలవంతం చేశాడని, అందుకు ఆమె నిరాకరించడంతోనే హత్య చేశాడని ఊహాగానాలు వెల్లువెత్తాయి.

ఇవీ చదవండి: సైన్యం ఎంట్రీతో శ్రీలంక లైన్​ క్లియర్! లగ్జరీ కార్లు సేఫ్​.. ప్రధాని కుర్చీకి కాపలా!!

లంక అధ్యక్షుడు రాజపక్స రాజీనామా.. సింగపూర్​లో మకాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.