ETV Bharat / international

చాలా ఏళ్ల తర్వాత భారత్​కు పాకిస్థాన్​ మంత్రి.. ఇదే కారణం

భారత్​లో జరిగే షాంఘై సహకార సంస్థ-ఎస్​సీఓ సమావేశానికి.. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరు కానున్నారు. 2014లో నవాజ్‌ షరీఫ్‌ పర్యటన తర్వాత ఆ దేశ నాయకులు భారత్‌కు రావడం ఇదే తొలిసారి.

pakistan-foreign-minister-bilawal-bhutto-to-attend-sco-meeting-in-india-in-may
భారత్‌లో జరిగే SCO సమావేశానికి పాక్ మంత్
author img

By

Published : Apr 20, 2023, 2:15 PM IST

Updated : Apr 20, 2023, 3:08 PM IST

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్‌లో పర్యటించనున్నారు. గోవాలో వచ్చే నెల జరగనున్న షాంఘై సహకార సంస్థ-ఎస్​సీఓ విదేశాంగ మంత్రుల సమావేశంలో బిలావల్ భుట్టో పాల్గొననున్నారు. 2014లో అప్పటి పాకిస్థాన్ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పర్యటన తర్వాత ఆ దేశ నాయకులు భారత్‌కు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మే 4, 5 తేదీల్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశాలకు పాక్​ విదేశాంగ మంత్రి బిలావల్​ భుట్టో హాజరుకానున్నారు. ఎస్​సీఓ అనేది.. రష్యా, చైనా, భారత్‌, పాకిస్థాన్​తో కూడిన ప్రాంతీయ రాజకీయ, భద్రతా కూటమి.

ఎస్​సీఓ సమావేశానికి హాజరు కావాలని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. బిలావల్ భుట్టో జర్దారీను ఆహ్వానించారని అక్కడి అధికారులు తెలిపారు. "సమావేశంలో పాకిస్థాన్​ భాగస్వామ్యం.. ఎస్​సీఓ పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.​ విదేశాంగ విధాన ప్రాధాన్యాల్లో పాకిస్థాన్ ఇచ్చే ప్రాముఖ్యాన్ని తెలియపరుస్తుంది. మే 4-5 తేదీల్లో గోవాలో జరిగే షాంఘై సహకార సంస్థ సమావేశానికి పాకిస్థాన్ ప్రతినిధి బృందానికి బిలావర్ భుట్టో జర్దారీ నాయకత్వం వహిస్తారు." అని పాకిస్థాన్ అధికారులు తెలిపారు.

2019 ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా.. పాకిస్థాన్​లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. అప్పటి నుంచి పాకిస్థాన్​, భారత్​ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 2019లో ఆగస్టులో జమ్ము కశ్మీర్​కు ఉన్న రాష్ట్ర హోదాను భారత ప్రభుత్వం తొలగించి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక అధికారాలను రద్దు చేసింది. దీంతో భారత్​, పాకిస్థాన్​ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.

2001లో షాంఘైలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఎస్​సీఓ ఏర్పాటైంది. రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల అప్పటి అధ్యక్షులు దీని స్థాపనకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఇది అతిపెద్ద ప్రాంతీయ అంతర్జాతీయ సంస్థలలో ఒకటిగా ఉద్భవించింది. 2017లో చైనా రాజధాని బీజింగ్ జరిగిన ఎస్​సీఓ సమావేశంలో భారత్​, పాకిస్థాన్​ ఈ సంస్థలో సభ్యులుగా చేరాయి.

2011లో పాకిస్థాన్​ విదేశాంగ మంత్రి హోదాలో హీనా రబ్బానీ ఖర్​ భారత్​లో పర్యటించారు. అలాగే 2014లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అప్పటి పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్​ షరీఫ్ భారత్​కు వచ్చారు. అలాగే 2015 డిసెంబరులో విదేశాంగ మంత్రి హోదాలో సుష్మా స్వరాజ్ పాకిస్థాన్​లో పర్యటించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ కూడా పాకిస్థాన్​ను సందర్శించారు.

Last Updated : Apr 20, 2023, 3:08 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.