అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. న్యూ ఒర్లీన్స్‌లో ఓ పాఠశాల స్నాతకోత్సవంలో ఇద్దరు మహిళల మధ్య తలెత్తిన వివాదం కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు మృతి చెందగా.. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. జేవియర్ యూనివర్శిటీ ఆఫ్ లూసియానా కాన్వొకేషన్ సెంటర్ సమీపంలోని మొరిస్ జెఫ్ కమ్యూనిటీ స్కూల్లో ఉదయం 11.45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
"ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. పార్కింగ్ ప్రాంతంలో జరిగిన గొడవలో ఎవరు తుపాకీ తీశారు, ఎన్ని గన్లు ఉన్నాయి, ఎన్ని తుటాలు పేల్చారు అనే సమాచారం తెలియదు. "
- క్రిస్ గూడ్లీ, డిప్యూటీ సూపరింటెండెంట్.
ఈశాన్య లూసియనా వర్సిటీలో జరిగిన పాఠశాల స్నాతకోత్సవంలో కాల్పులు జరిగి నలుగురు గాయపడిన ఘటన జరిగిన రెండు వారాల తర్వాత మరోమారు తుపాకీ పేలటంపై ఆందోళన వ్యక్తం చేశారు లూసియానా గవర్నర్ జాన్ బెల్ ఎడ్వర్డ్స్. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు సురక్షితంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చూడండి..