ETV Bharat / international

ముంబయి పేలుళ్ల సూత్రధారికి 15 ఏళ్ల జైలు శిక్ష - సాజిద్​ మీర్​ న్యూస్​

నిషేధిత ఉగ్రవాద సంస్థ చెందిన సాజిద్​ మజీద్​కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది పాకిస్థాన్ కోర్టు. 2008 ముంబయి పేలుళ్ల సూత్రధారి అయిన మజీద్​కు శిక్షతో పాటు రూ.4 లక్షల జరిమానా విధించింది.

sajid majeed mir news
sajid majeed mir news
author img

By

Published : Jun 25, 2022, 10:50 AM IST

ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే-యి-తొయిబాకు చెందిన సాజీద్​ మజీద్​కు శిక్ష పడింది. 2008 ముంబయి పేలుళ్ల సూత్రధారి అయిన మజీద్​కు 15 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది పాకిస్థాన్​ యాంటీ టెర్రరిజం కోర్టు. దీంతో పాటు రూ.4 లక్షల జరిమానా విధించింది. కొంతకాలం క్రితం సాజిద్​ మీర్​ మరణించినట్లు పాకిస్థాన్​ వర్గాలు వెల్లడించాయి. కానీ పాశ్చాత్య దేశాలు ఆధారాలు కావాలంటూ కోరాయి. దీంతో దర్యాప్తు మొదలుపెట్టిన పాకిస్థాన్​ టాస్క్​ఫోర్స్​ సాజిద్​ను అరెస్ట్​ చేసింది. పంజాబ్​ కౌంటర్​ టెర్రరిజం పోలీసులు సాధారణంగా ఇలాంటి కేసుల్లో మీడియాకు వివరాలు వెల్లడిస్తారు. కానీ దీనికి సంబంధించిన విషయాలను బహిర్గత పరచలేదు. సాజిద్​ను అరెస్ట్​ చేసినందున తమను గ్రే లిస్టు నుంచి తొలగించాలని పాకిస్థాన్​ కోరినట్లు స్థానిక మీడియా తెలిపింది. 40 ఏళ్ల సాజిద్​పై అమెరికా 5 మిలియన్ డాలర్ల నజరానా ప్రకటించింది. అతడు ఏప్రిల్​లో అరెస్ట్​ కాగా.. ప్రస్తుతం కోట్​ లఖ్​పత్ జైలులో ఉన్నట్లు సీనియర్​ న్యాయవాది తెలిపారు.

2005లో నకిలీ పాస్​పోర్టుతో భారత్​కు వచ్చి వెళ్లిన సాజిద్..​ 2008 నవంబర్ 11న పాకిస్థాన్ నుంచి సముద్ర మార్గం గుండా పది మంది ఉగ్రవాదులతో కలిసి ముంబయి చేరుకున్నాడు. అనంతరం నగరంలోని 12 ప్రాంతాలపై దాడి చేసి 166 మంది పౌరులను పొట్టన పెట్టుకున్నారు. ఈ నరమేధంలో ఆరుగురు అమెరికా పౌరులు కూడా మృతిచెందారు.

అంతకుముందు ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్​ సయీద్​ 68 ఏళ్ల జైలు శిక్ష విధించింది లాహోర్​ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు. అతడు ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నాడు. లష్కరే-యీ-తొయిబా అనుబంధ సంస్థగా పనిచేస్తున్న జేయూడీని విదేశీ ఉగ్రవాద సంస్థగా 2014లోనే గుర్తించింది అమెరికా. సయీద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అగ్రరాజ్యం.. అతని ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్​ డాలర్లు బహుమానం ఇస్తామని తెలిపింది.

ఇదీ చదవండి: అఫ్గాన్‌లో 1,150కి చేరిన మృతుల సంఖ్య.. మరోసారి కంపించిన భూమి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.