ETV Bharat / international

కీలక ఒప్పందాలు.. గూగుల్​, అమెజాన్​ పెట్టుబడులు.. మోదీ అమెరికా టూర్​ సక్సెస్​! - అమెరికా పర్యటనలో మోదీ

Modi US Visit 2023 : ప్రధాని మోదీ నాలుగు రోజుల అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. అమెరికాతో రక్షణ, టెక్నాలజీ రంగాల్లో భారత్‌ కీలక ఒప్పందాలు కుదుర్చుకోగా.. తన పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధం సరికొత్త మైలురాయిని చేరిందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్‌-అమెరికా భాగస్వామ్యం 21వ దశాబ్దంలో ప్రపంచ భవిష్యత్‌ను మార్చగలదని పేర్కొన్నారు. మెరుగైన ప్రపంచ నిర్మాణానికి బాటలు వేసే ఈ పరిణామాన్ని యావత్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా గమనిస్తోందని పేర్కొన్నారు. భారతీయ అమెరికన్లకు మేలు జరిగేలా H1-Bవీసా నిబంధనల్లో కీలక మార్పులు వస్తాయని ప్రకటించారు.

Modi US Visit 2023
Modi US Visit 2023
author img

By

Published : Jun 24, 2023, 12:46 PM IST

Updated : Jun 24, 2023, 12:58 PM IST

Modi US Visit 2023 : ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు రోజులపాటు అమెరికాలో విసృతంగా పర్యటించారు. మొదట అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. తర్వాత అధ్యక్షుడు జో బైడెన్ దంపతుల ఆహ్వానం మేరకు శ్వేతసౌధానికి వెళ్లారు. బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన మోదీ.. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలను ఖరారు చేశారు.

శుక్రవారం శ్వేతసౌధంలో రెండు దేశాలకు చెందిన దిగ్గజ సంస్థల CEOలతో ఆయన ముచ్చటించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదళ్ల, యాపిల్ CEO టిమ్ కుక్, గూగుల్‌ CEO సుందర్‌ పిచాయ్, ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్‌మన్, నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ వంటి అమెరికా ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత్‌ నుంచి రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ, మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్ మహీంద్రా వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

  • US President Joe Biden gifted a special T-Shirt to PM Narendra Modi with the PM's quote on AI.

    "In the past few years, there have been many advances in AI- Artificial Intelligence. At the same time, there has been even more momentous development in another AI- America and… pic.twitter.com/yjcAtaFlGF

    — ANI (@ANI) June 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

PM Modi US Tour : భారత్‌-అమెరికా భాగస్వామ్యం భవిష్యత్ తరాలకు మరింత స్వేచ్ఛాయుత, భద్రమైన, సాధికారతకు భరోసా ఇస్తుందని బైడెన్ చెప్పారు. బైడెన్ విజన్, సామర్థ్యాలు, భారత ఆకాంక్షలు.. గొప్ప అవకాశాలు సృష్టిస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. భారత్‌ నైపుణ్యాలు, అమెరికా అధునాతన సాంకేతికత కలిస్తే ప్రపంచానికి మరింత మెరుగైన భవిష్యత్‌ను అందించవచ్చని తెలిపారు. హైటెక్‌ రంగంలో భారత్‌, ఆమెరికా బంధం మరింత బలోపేతమవుతున్న నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాని సూచించారు.

తర్వాత జాన్‌ ఎఫ్‌.కెన్నెడి సెంటర్‌లో జరిగిన యువ పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణుల సమావేశంలో పాల్గొన్న ప్రధాని.. భారత్‌ బలపడినప్పుడల్లా ప్రపంచానికి మేలు జరిగినట్లు చెప్పారు. కరోనా సమయంలో ప్రపంచానికి ఔషధాలు అవసరమైనప్పుడు.. భారత్‌ ఉత్పత్తిని పెంచి మందులు సరఫరా చేసినట్లు తెలిపారు. భారత్‌ విజయాలకు, అభివృద్ధికి ప్రజల ఆకాంక్షలే.. అతిపెద్ద చోదకశక్తి అని కొనిడాయారు. గత రెండున్నరేళ్లలో అమెరికా కంపెనీలు భారత్‌లో 16 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు ప్రధాని వెల్లడించారు.

"ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ గురించి మీకు తెలిసే ఉంటుంది. అధిక వృద్ధిరేటు, తక్కువ ద్రవ్యోల్బణం సాధించడం అంత సులభం ఏమీ కాదు. కానీ భారత్‌ దానిని కూడా చేసి చూపుతోంది. ద్రవ్యలోటును నియంత్రణలో ఉంచుతూనే మూలధన పెట్టుబడులను క్రమంగా పెంచుతున్నాం. మా ఎగుమతులు పెరుగుతున్నాయి. విదేశీ మారక నిల్వలు పెరుగుతూనే ఉన్నాయి. విదేశీ పెట్టుబడులు కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. గత రెండున్నరేళ్లలో అమెరికా కంపెనీలు 16 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టాయి."

--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

PM Modi US News : అమెరికా పర్యటనలో చివరిగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. భారత్‌-అమెరికా బంధం బలోపేతం కావడాన్ని యావత్‌ ప్రపంచం గమనిస్తోందని తెలిపారు. రెండు దేశాల ద్వైపాక్షిక బంధం మేక్‌ ఇన్‌ ఇండియా-మేక్‌ ఫర్ వరల్డ్‌ ప్రయత్నాలకు నూతనోత్తేజం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రవాస భారతీయులకు ఊరటనిచ్చేలా H1-B వీసాలపై కీలక ప్రకటన చేశారు. వీసా రెన్యువల్‌ కోసం అమెరికాను వీడి వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. అమెరికాలో కొత్తగా రెండు కాన్సులేట్ కార్యాలయాలను ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో సమావేశానికి హాజరైన ప్రవాస భారతీయులు కరతాళ ధ్వనులతో మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

"ఈ పర్యటనలో మేక్‌ ఇన్‌ ఇండియా-మేక్ ఫర్‌ ద వరల్డ్ ప్రయత్నాలకు సహకారం లభించింది. సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, తయారీ రంగంలో పరస్పర సహకారం, పారిశ్రామిక సరఫరా చైన్‌లో వృద్ధి వంటి అంశాల్లో రెండు దేశాలు మంచి భవిష్యత్‌ కోసం ఒక బలమైన ముందడుగు వేశాయి. జనరల్‌ ఎలక్ట్రిక్ కంపెనీ భారత్‌లో ఫైటర్ జెట్‌ ఇంజిన్లు తయారు చేసేందుకు తీసుకున్న నిర్ణయం.. భారతీయ రక్షణ రంగానికి కీలక మైలు రాయి అవుతుంది. ఈ ఒప్పందంలో అమెరికా భారత్‌కు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం మాత్రమే కాదు.. పరస్పర విశ్వాసాన్ని కూడా పంచుకుంటోంది."

--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

PM Modi America Visit : అభివృద్ధి పథంలో ఎలా ముందుకెళ్లాలో భారత్‌కు స్పష్టంగా తెలుసునని చెప్పిన మోదీ.. విధాన నిర్ణయాల విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి సందేహాలు లేవన్నారు. సమస్యలు పరిష్కరించడంలోనూ స్పష్టమైన వైఖరితో ముందుకెళుతున్నట్లు స్పష్టం చేశారు. అంతకుముందు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ ఇచ్చిన విందుకు ప్రధాని మోదీ హాజరయ్యారు.

  • Prime Minister Narendra Modi exchanges special gifts with President of the United States Joe Biden and First Lady Jill Biden at The White House, in Washington, DC. pic.twitter.com/IdHIgo2doA

    — ANI (@ANI) June 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మోదీ కాళ్లు మొక్కిన అమెరికన్​ సింగర్​
ప్రఖ్యాత అమెరికన్‌ గాయని మేరీ మిల్బెన్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అమెరికాలో మోదీ అధికారిక పర్యటన ముగింపు కార్యక్రమంలో భారత జాతీయ గీతం జనగణమనను ఆలపించిన మేరీ మిల్బెన్‌.. అనంతరం ప్రధాని పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. యునైటెడ్‌ స్టేట్స్‌ ఇండియన్‌ కమ్యూనిటీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మిల్బెన్‌ జాతీయ గీతాన్ని ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోను అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ట్విటర్‌లో పోస్టు చేశారు. ఆఫ్రో-అమెరికన్‌ హాలీవుడ్‌ నటి, గాయని అయిన మిల్బెన్‌ గతంలో ఓం జై జగదీశ్‌ హరే పాట పాడి భారతీయులకు సుపరిచితురాలయ్యారు.

  • Indian culture possesses a remarkable beauty, as its values transcend boundaries effortlessly. Through the humble act of touching feet of Hon PM Shri @narendramodi Ji, @MaryMillben has exemplified profound respect for our ancient values. It truly represents the idea of 'One… pic.twitter.com/dAMEuqmffj

    — Himanta Biswa Sarma (@himantabiswa) June 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Jun 24, 2023, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.