అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ వరుస బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగులు సైనికులు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. మరో 15 మంది సాధారణ వ్యక్తులకు గాయాలైనట్లు వివరించారు. దుండగులు హ్యాండ్ గ్రనైడ్‌లతో దాడులకు తెగబడినట్లు అధికారులు వెల్లడించారు. గత నాలుగు రోజులుగా.. ఉగ్రవాదులుకు సైనికులకు మధ్య దాడులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. క్వెట్టా నగరంలో సబ్జల్ రహదారిపై రెండు గ్రనైడ్‌లను విసరగా.. ఒకటి పేలినట్లు తెలిపారు. మరో దానిని సిబ్బంది నిర్వీర్యం చేసినట్లు వెల్లడించారు. దాడుల నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు బలూచిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. ఉగ్రదాడుల చర్యను బలూచిస్థాన్ ముఖ్యమంత్రి అబ్దుల్ ఖుదూస్ బిజెంజో తీవ్రంగా ఖండించారు.
నదిలో పడిన బస్సు..8 మంది మృతి
స్పెయిన్లో ఘోర ప్రమాదం జరిగింది. వంతెనపై వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు నదిలో పడి.. ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. శనివారం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా బస్సు అదుపుతప్పి.. క్రిస్మస్ ఈవ్‌లోని వంతెన పైనుంచి దాదాపు 30 అడుగుల లోతులో పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో వాహనంలో 10 మంది ఉన్నట్లు గుర్తించారు. ఆదివారం సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది.. 8 మృతదేహాలను వెలికితీశారు. మరో ఇద్దరు గాయాలతో గాయపడి ఒడ్డుకు చేరినట్లు అధికారులు తెలిపారు.