ETV Bharat / international

Mexico Truck Accident 2023 : బోల్తా పడ్డ 'వలస కూలీల' ట్రక్కు.. 10 మంది మృతి.. మరో 15 మంది... - ట్రక్కు ప్రమాదాలు

Mexico Truck Accident 2023 : ప్రమాదవశాత్తు ఓ ట్రక్కు బోల్తా పడి 10 మంది చనిపోయారు. మరో 15 మంది గాయపడ్డారు. మెక్సికోలో ఆదివారం ఈ ఘటన జరిగింది. బాధితులు వలస కూలీలని తెలిసింది.

mexico-truck-accident-2023-sevaral-died-and-injured
v
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 7:06 AM IST

Updated : Oct 2, 2023, 7:50 AM IST

Mexico Truck Accident 2023 : మెక్సికోలో ఓ ట్రక్కు బోల్తా పడి 10 మంది మృతి చెందారు. దాదాపు 15 మంది గాయపడ్డారు. టపాచులా నగరంలోని ఓ రహదారిపై ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. బాధితులు వలస కూలీలేనని తెలిసింది.
పిజిజియాపాన్​ ప్రాంతంలో గ్వాటెమాల సరిహద్దులో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. బాధితులంతా అమెరికా సరిహద్దు వైపుగా వెళుతున్నట్లు సమాచారం. గ్వాటెమాల దేశానికి 175 కిలో మీటర్లు దూరంలో ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికారులు వివరించారు.

అయితే బాధితులు ఏ దేశానికి చెందిన వారు, వారిలో ఎంత మంది వలస కూలీలు అన్నారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు అధికారులు. కానీ అక్కడి స్టేట్​ ప్రాసిక్యూటర్​కు చెందిన ఓ ఉద్యోగి మాత్రం వారంతా క్యూబాకు చెందిన వారని తెలిపారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం లేదని ఆయన వెల్లడించారు.

హైవేపై నుంచి లోయలో పడ్డ బస్సు.. చిన్నారులు సహా 17 మంది మృతి..
Mexico Bus Accident : ఆగస్టు నెలలోనూ మెక్సికోలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు హైవేపై నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు. నయరిట్ రాష్ట్రంలో మెక్సికో కాలమాన ప్రకారం తెల్లవారుజామున జరిగిందీ దుర్ఘటన. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

రోడ్డు ప్రమాదం.. 27 మంది మృతి..
Mexico Bus Crash : అంతకు ముందు కూడా మెక్సికోలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో 27 మంది మృతి చెందారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. బస్సు అదుపుతప్పి లోయలో పడటం వల్ల ఈ దారుణం జరిగింది. ఓక్సాకా రాష్ట్రంలోని మిక్స్‌టెకా ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. చనిపోయిన వారిలో సంవత్సరన్నర చిన్నారి కూడా ఉంది. డ్రైవర్​కు అనుభవం లేకపోవడం, అలసటే ప్రమాదానికి కారణంగా తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated : Oct 2, 2023, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.