ETV Bharat / international

మొసలిని పెళ్లాడిన 'మేయర్'.. గ్రాండ్​గా పార్టీ.. ప్రజల కోసమేనట! - మొసలి వివాహం

Mayor marries alligator: సంప్రదాయ దుస్తులు, మేళతాళాలు, అతిథుల కోలాహలం మధ్య మెక్సికోలోని ఓ గ్రామంలో జరిగిన వివాహం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. వరుడు ప్రజాప్రతినిధి కాగా.. వధువు మొసలి కావడమే ఇందుకు కారణం. ఇంతకీ ఎందుకిలా? ఈ మకర వివాహం వెనుక మర్మమేంటి?

mayor marries alligator
మెక్సికో మేయర్
author img

By

Published : Jul 4, 2022, 4:36 PM IST

Mayor marries alligator: మెక్సికోలోని ఓ నగర మేయర్.. మొసలిని సంప్రదాయబద్ధంగా వివాహమాడారు. వందల మంది అతిథుల మధ్య.. పెళ్లి కూతురు దుస్తుల్లో అందంగా ముస్తాబైన ఏడేళ్ల మొసలిని జీవిత భాగస్వామిగా స్వీకరించారు. ఓక్సాకా రాష్ట్రం సాన్ పెడ్రో హువామెలులాలోని ఓ మత్స్యకార గ్రామం ఇందుకు వేదికైంది. తన ప్రాంతంలోని ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ ఇలా చేసినట్లు తెలిపారు సాన్​ పెడ్రో హువామెలులా మేయర్ విక్టర్ హ్యూగో సూసా.

mayor marries alligator
పెళ్లికూతురు దుస్తుల్లో మొసలి

మొసలిని వివాహమాడే సంప్రదాయం మెక్సికోలో చాలా పురాతనమైంది. మొసలిని వారు భూమాతగా, దేవతగా కొలుస్తారు. ఇలాంటి పెళ్లిళ్లను మనుషులకు, దేవతలకు మధ్య బంధంగా చూస్తారు. అందుకే.. ఈ సంప్రదాయానికి కొనసాగింపుగా గత గురువారం మొసలిని మనువాడారు విక్టర్. అలా అని ఈ పెళ్లిని ఏదో తూతూమంత్రంగా పూర్తి చేయలేదు. వధువు కోసం ప్రత్యేకంగా దుస్తులు రూపొందించారు. మొసలి నోటిని తాడుతో కట్టేసి, అందంగా అలంకరించారు. కొత్త బట్టల్లో మెరిసిపోతున్న మకరాన్ని ఇద్దరు జాగ్రత్తగా పట్టుకుని వీధుల్లో ఊరేగింపుగా పెళ్లి మండపానికి తీసుకొచ్చారు.

mayor marries alligator
మొసలిని ముద్దాడుతున్న మేయర్

సంప్రదాయబద్ధంగా మొసలిని వివాహమాడిన మేయర్ విక్టర్ హ్యూగో సూసా.. దానిని ముద్దు పెట్టుకున్నారు. ఆనందంతో నృత్యం చేశారు. "పుష్కలంగా వర్షాలు కురవాలని, సమృద్ధిగా పంటలు పండాలని, నదిలో చేపలు బాగా దొరకాలని మేము ప్రకృతిని ప్రార్థిస్తున్నాం" అని వివాహ మహోత్సవం సందర్భంగా అన్నారు విక్టర్.

ఇదీ చూడండి : బాలుడిని నదిలోకి లాక్కెళ్లిన మొసలికి ఎక్స్​రే.. రిపోర్ట్స్​ చూస్తే...

భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. ఛార్జీ రూ.3వేలే.. అందుకోసమేనటా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.