Mega Millions Jackpot Lottery : ఫ్లోరిడా మెగా మిలియన్స్ లాటరీలో ఓ వ్యక్తి 1.58 బిలియన్ డాలర్ల ( సుమారు రూ.13 వేల కోట్లు) జాక్‌పాట్ కొట్టారు. విజేత వివరాలు తెలియలేదు. అయితే.. నెఫ్యూన్ బీచ్‌లోని పబ్లిక్స్ స్టోర్ నిర్వహకులు ఈ టిక్కెట్‌ను విక్రయించారు. కాగా లాటరీ నిర్వాహకులు.. మంగళవారం డ్రా తీశారు. అందులో 13, 19, 20, 32, 33, 14 నెంబర్ టికెట్‌కు జాక్‌పాట్ దక్కినట్లు మెగా మిలియన్స్ లాటరీ నిర్వాహకులు తెలిపారు. అమెరికా చరిత్రలో మూడో అతి పెద్ద లాటరీ ప్రైజ్‌మనీ ఇదేనని అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. కాగా ఏప్రిల్ 18 నుంచి ఏ ఒక్కరూ డ్రాలో గెలుపొందలేరని నిర్వాహకులు తెలిపారు.
అయితే డ్రాలో గెలుపొందిన వ్యక్తికి.. ఈ 1.58 బిలియన్ నగదును ఏడాదికి కొంత మొత్తం చొప్పున 30 ఏళ్ల పాటు చెల్లిస్తారు. అలా కాకుండా ఒకేసారి ఈ మొత్తాన్ని పొందాలంటే.. వారికి సుమారు 783.3 మిలియన్ డాలర్లు (రూ.6400 కోట్లు) మాత్రమే వస్తాయి. సాధారణంగా ఎక్కువ మంది విజేతలు.. ఇలా ఒకేసారి తీసుకోవడానికే మొగ్గు చూపుతారు.
ఇలాంటి లాటరీ ప్రైజ్‌మనీపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు టాక్స్‌లు విధిస్తుంటాయి. మెగా మిలియన్ లాటరీ అమెరికా వ్యాప్తంగా 45 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీ, యూఎస్ వర్జిన్ ద్వీపాల్లో నిర్వహిస్తున్నారు. అయితే నెప్యూన్ బీచ్ ప్రాంతం.. అట్లాంటిక్ తీరం తూర్పు జాక్సన్విల్లేకు 16 (26 కిలోమీటర్ల) మైళ్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ 7 వేల మంది నివసిస్తుంటారు.
Mega Millions Lottery 2022 : గతేడాది జులైలో ఇదే మెగా మిలియన్ డ్రా లో మరో వ్యక్తి.. 1.28 బిలియన్ డాలర్ల (అప్పటి కరెన్సీ విలువతో పోలిస్తే సుమారు రూ. 10వేల కోట్లు) జాక్‌పాట్ తగిలింది. కాగా ఇలినాయ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఎవరో ఈ టిక్కెట్ కొన్నట్లు అప్పట్లో నిర్వాహకులు తెలిపారు. కాగా అప్పుడు అమెరికా లాటరీ చరిత్రలో ఇదే మూడో అతిపెద్ద ప్రైజ్‌మనీ.
'రూ.కోటి లాటరీ గెలిచా.. నన్ను కాపాడండి ప్లీజ్'.. పోలీస్ స్టేషన్‌కు కూలీ పరుగు
బ్యాంకు క్లర్క్‌కు జాక్‌పాట్.. లాటరీలో రూ.కోటి.. టికెట్ తీసుకున్న గంటకే!