ETV Bharat / international

రష్యాకు మెక్​డొనాల్డ్స్​ షాక్​.. వ్యాపారం విక్రయం!.. నష్టం ఎంతంటే? - ఉక్రెయిన్

McDonalds to sell its Russian business: రష్యాకు మరో బడా సంస్థ షాకిచ్చింది. ఉక్రెయిన్​పై యుద్ధం నేపథ్యంలో రష్యాలోని తమ వ్యాపారాలను మూసివేస్తున్నట్లు దిగ్గజ సంస్థ మెక్​డొనాల్డ్స్​ ప్రకటించింది. వ్యాపారాన్ని విక్రయించే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపింది.

McDonalds
mcdonalds to close in russia
author img

By

Published : May 16, 2022, 5:40 PM IST

McDonalds to sell its Russian business: రష్యాలోని తమ వ్యాపారాలను మూసివేస్తున్నట్లు దిగ్గజ ఫాస్ట్​ఫుడ్​ సంస్థ మెక్​డొనాల్డ్స్​ సోమవారం వెల్లడించింది. విక్రయ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. ఆ దేశంలో మెక్​డొనాల్డ్స్​కు 850 రెస్టారెంట్లలో 62వేల మంది ఉగ్యోగులున్నారు. దీంతో ఫిబ్రవరిలో ఉక్రెయిన్​పై యుద్ధం ప్రకటించిన నాటి నుంచి రష్యాను విడిచి వెళ్తున్న అతి పెద్ద పాశ్చాత్య సంస్థల జాబితాలో మెక్​డొనాల్డ్స్​ చేరినట్లు అయ్యింది.

McDonalds
రష్యాలోని మెక్​డొనాల్డ్స్

యుద్ధం కారణంగా ఏర్పడిన మానవతా సంక్షోభాన్ని ఎత్తిచూపుతూ.. "రష్యాలో ఇకపై వ్యాపారం చేయడం సమంజసం కాదు. అది సంస్థ విలువలకు విరుద్ధం కూడా" అని మెక్​డొనాల్డ్స్​ పేర్కొంది. చికాగో కేంద్రంగా ఉన్న ఈ సంస్థ.. రష్యాలోని స్టోర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మార్చిలో ప్రకటించింది. అయినా ఉద్యోగులకు జీతాలు ఇస్తూ వచ్చింది.

ఈ విక్రయం ముగిసే వరకు ఉద్యోగులను నియమించుకుని, వారికి జీతాలిచ్చేందుకు ఓ కొనుగోలుదారుడి కోసం ప్రయత్నిస్తున్నట్లు మెక్​డొనాల్డ్స్​ సోమవారం తెలిపింది. "సంస్థ పట్ల ఉద్యోగులు, రష్యా సరఫరాదారుల అంకితభావం, విధేయత వల్ల ఇలాంటి (మూసివేత) నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైంది. అయితే విలువలకు కట్టుబడి ఉండటం మూలంగా ఇవి తప్పదు"​ అని మెక్​డొనాల్డ్స్​ సీఈఓ క్రిస్ చెప్పారు.

బలమైన ప్రస్థానం: మాస్కో నడిబొడ్డున మూడు దశాబ్దాల కింద.. బెర్లిన్ గోడ పతనమైన కొన్నాళ్లకే రష్యాలో తొలి మెక్​డొనాల్డ్స్​​ ప్రారంభమైంది. అమెరికా, సోవియెట్​ యూనియన్ మధ్య ఉన్న ప్రచ్ఛన్న యుద్ధ ఉద్రిక్త పరిస్థితులు సడలుతున్నాయనేదానికి ఇది బలమైన సంకేతంగా నిలిచింది. 1991లో పతనమైన సోవియన్​ యూనియన్​లో ఏర్పడిన తొలి అమెరికన్ ఫాస్ట్​ఫుడ్​ రెస్టారెంట్​ కూడా ఇదే.

ఇవి కూడా..: రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో ఇప్పటికే కోకాకోలా, పెప్సీ, స్టార్​బక్స్​ లాంటి అమెరికన్ ఫుడ్ అండ్ బేవరేజెస్ సంస్థలు ఆ దేశంలో తమ వ్యాపారాలను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా మూసివేయడం లాంటివి చేశాయి. బ్రిటిష్ ఎనర్జీ దిగ్గజాలు షెల్, బీపీ నుంచి ఫ్రెంచ్​ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్​ వరకు రష్యా నుంచి వైదొలిగాయి. మరికొన్ని సంస్థలు పాక్షికంగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.

రష్యాలో తమ వ్యాపారాన్ని మూసివేయడం ద్వారా దాదాపు 1.2 బిలియన్ డాలర్ల నుంచి 1.4 బిలియన్ డాలర్ల మధ్య (దాదాపు రూ.10 వేల కోట్లు) ఆదాయంలో కోత పడుతుందని మెక్​డొనాల్డ్స్​ అంచనా వేస్తోంది. ఉక్రెయిన్​లో ఇప్పటికే ఆ సంస్థ రెస్టారెంట్లను మూసివేసింది. అక్కడి ఉద్యోగులకు జీతాలను అందిస్తోంది. 100కు పైగా దేశాల్లో 39వేలకు పైగా మెక్​డొనాల్డ్స్​ స్టోర్లు ఉన్నాయి. అయితే అందులో 5శాతం మాత్రమే సంస్థ సొంతంగా నిర్వహిస్తోంది. మిగిలినవి ఫ్రాంఛైజీల చేతుల్లో ఉన్నాయి.

రష్యా నుంచి వైదొలిగినా.. ఈ ఏడాది కొత్తగా మరో 1300 రెస్టారెంట్లను ఏర్పాటు చేసే ప్రణాళిక యథావిధిగా కొనసాగుతోందని మెక్​డొనాల్డ్స్​ స్పష్టంచేసింది. దీని ద్వారా సంస్థకు విక్రయాల్లో 1.5శాతం వృద్ధి లభించనుంది. ఇక ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 1.1 బి.డాలర్ల (సుమారు రూ.8.6వేల కోట్లను) లాభం ఆర్జించినట్లు గత నెలలో వెల్లడించింది మెక్​డొనాల్డ్స్​. అది అంతకుముందు ఏడాదితో (1.5 బి.డాలర్లు) పోలిస్తే తక్కువే. సంస్థ ఆదాయం దాదాపు 5.7 బి.డాలర్లుగా (సుమారు రూ.44వేల కోట్ల) ఉంది.

ఇదీ చూడండి: 'పుతిన్‌కు రక్త కేన్సర్​.. తీవ్ర అస్వస్థత'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.