రష్యా-క్రిమియాను కలిపే కెర్చ్ రోడ్డు, రైలు వంతెనపై శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్లు రష్యా అధికారులు తెలిపారు. ఈ వంతెనపై కారు బాంబు పేలడం వల్ల క్రిమియాకు వెళ్తోన్న ఏడు ఆయిల్ ట్యాంకర్లకు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం జరిగినట్లు రష్యా వార్త సంస్థలు వెల్లడించాయి. ప్రమాదం కారణంగా వంతెనపై భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల తీవ్రతకు వంతెనపై కొంత భాగం కూలి సముద్రంలో పడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై ఇంతవరకూ స్పష్టత రాలేదు.
అజోవ్ సముద్రాన్ని, నల్ల సముద్రాన్ని కెర్చ్ జలసంధి కలుపుతుంది. ఉక్రెయిన్ అంతర్జాతీయ వాణిజ్యాన్ని నల్ల సముద్రం ద్వారానే నిర్వహిస్తోంది. అజోవ్ తీరం నుంచి నల్లసముద్రం మీదుగా ఉక్రెయిన్ వాణిజ్యం సాగాలంటే కెర్చ్ జలసంధిని దాటాల్సిందే. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన ఈ నల్ల సముద్రంపై ఆధిపత్యం కోసం తీవ్రంగా యత్నిస్తోన్న రష్యా.. 2014లో క్రిమియా ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత రష్యా-క్రిమియాను కలిపేలా 2018లో 3 బిలియన్ డాలర్లు వెచ్చించి కెర్చ్ జలసంధిపై రోడ్డు, రైలు వంతెనను మాస్కో నిర్మించింది. అధ్యక్షుడు పుతిన్ స్వయంగా దీనిపై ట్రక్కు నడిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తోన్న క్రెమ్లిన్ ఈ మార్గం ద్వారానే ఆయుధాలు, బలగాలను చేరవేస్తోంది.
ఉక్రెయిన్ పనేనా..
కెర్చ్ వంతెనపై పేలుడుకు ఉక్రెయినే కారణమని క్రిమియా అధికారి ఒకరు ఆరోపించారు. తమ లక్ష్యాల్లో ఈ వంతెన కూడా ఉందని ఇటీవల ఉక్రెయిన్ మిలిటరీ కమాండర్ ఒకరు చెప్పడం గమనార్హం. "రష్యా తమ వనరులను, దళాలను తరలించడానికి వీల్లేకుండా చేయడానికి ఇది అత్యవసరమైన చర్యగా భావిస్తున్నాం" అని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ కమాండర్ వ్యాఖ్యానించారు. రష్యా సేనలను అడ్డుకునే క్రమంలో ఈ వంతెనపై ఉక్రెయిన్ ఎప్పటినుంచో దృష్టిపెట్టింది. అయితే రష్యా దీన్ని కాపాడుకుంటూ వస్తోంది. ఒకవేళ కీవ్ దళాలు దీనిపై దాడిచేస్తే ప్రతిచర్య అత్యంత తీవ్రంగా ఉంటుందని మాస్కో తీవ్రంగా హెచ్చరించింది కూడా. తాజా పేలుడుతో ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా మారే ప్రమాదముంది.
-
Newest video, Kerch bridge 🌉 pic.twitter.com/hoA2tjeJvk
— M|§F|T 🇺🇸🇺🇦 (@am_misfit) October 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Newest video, Kerch bridge 🌉 pic.twitter.com/hoA2tjeJvk
— M|§F|T 🇺🇸🇺🇦 (@am_misfit) October 8, 2022Newest video, Kerch bridge 🌉 pic.twitter.com/hoA2tjeJvk
— M|§F|T 🇺🇸🇺🇦 (@am_misfit) October 8, 2022
-
CCTV footage of the explosion on the Kerch Bridge between Russia and Crimea this morning.
— Benjamin Strick (@BenDoBrown) October 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
pic.twitter.com/i0NUB4z5T9
">CCTV footage of the explosion on the Kerch Bridge between Russia and Crimea this morning.
— Benjamin Strick (@BenDoBrown) October 8, 2022
pic.twitter.com/i0NUB4z5T9CCTV footage of the explosion on the Kerch Bridge between Russia and Crimea this morning.
— Benjamin Strick (@BenDoBrown) October 8, 2022
pic.twitter.com/i0NUB4z5T9
ఇవీ చదవండి: 'రష్యా నుంచి చమురు కొనొద్దని భారత్‌కు ఎవరూ చెప్పలేదు.. అవసరమైతే ఎక్కడైనా కొంటాం'