ETV Bharat / international

దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం - pakisthan latest news

many killed in pakisthan accident
many killed in pakisthan accident
author img

By

Published : Mar 11, 2023, 10:55 PM IST

22:50 March 11

దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం

పాకిస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి జరిగిందీ ఘటన.
ఈ ప్రమాదం పంజాబ్‌లోని డేరా ఘాజీ ఖాన్ జిల్లాలో జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్​లో 46 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. వారందరూ దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. కాలువ నుంచి 10 మంది మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. 27 మంది క్షతగాత్రులను రక్షించామని తెలిపారు. మరో 9 మంది కాలువలో గల్లంతయ్యారని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.