చైనాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 17 మంది మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. జిలిన్ రాష్ట్ర రాజధాని చాంగ్‌చున్‌లోని ఓ రెస్టారెంట్లో బుధవారం మధ్యాహ్నం 12.40కి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి వేగంగా వ్యాపించగా.. అనేక మంది అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు.
అగ్నిప్రమాదానికి కారణం తెలియాల్సి ఉందని, దర్యాప్తు సాగుతోందని అధికారులు చెప్పారు. న్యూ ఏరియా ఇండస్ట్రియల్ జోన్‌లోని హైటెక్ ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. జిలిన్ రాష్ట్ర రాజధాని అయిన చాంగ్‌చున్.. వాహనాల తయారీ కేంద్రంగా ప్రసిద్ధి.
రెస్టారెంట్లో ఘోర అగ్ని ప్రమాదం- 17 మంది మృతి
రెస్టారెంట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించారు. ఈశాన్య చైనాలోని చాంగ్‌చున్‌లో జరిగిందీ దుర్ఘటన.