ETV Bharat / international

ఆసుపత్రిలోకి చొరబడి వైద్యసిబ్బందిపై కత్తితో దాడి.. పార్టీలో కాల్పుల మోత - ఆసుపత్రిలో కత్తితో దాడి

ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి చొరబడి ఓ దుండగుడు చెలరేగాడు. డాక్టర్​తోపాటు ఇద్దరు వైద్యసిబ్బందిని తీవ్రంగా పొడిచి గాయపరిచాడు. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఈ ఘటన జరిగింది. మరోవైపు.. పార్టీ జరుగుతున్న ఇంట్లోకి వెళ్లి ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు మరణించారు.

Man stabs 3 medical staffers at Southern California hospital

author img

By

Published : Jun 4, 2022, 12:49 PM IST

Updated : Jun 4, 2022, 1:43 PM IST

Man Attacks Medical Staff: అమెరికాలో దక్షిణ కాలిఫోర్నియాలోని ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో ఓ దుండగుడు కత్తితో బీభత్సం సృష్టించాడు. డాక్టర్​తో పాటు ఇద్దరు వైద్య సిబ్బందిని తీవ్రంగా గాయపరిచాడు. ఆ తర్వాత హాస్పిటల్ లోపల చాలాసేపు ఉండిపోయాడు. సరెండర్ అవ్వమని పోలీసులు అడిగినా వినిపించుకోలేదు. అతడి కోసం గాలించిన పోలీసులు చివరకి అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు.

శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు బాధితులను ట్రామా సెంటర్‌కు తరలించినట్లు అగ్నిమాపక అధికారులు చెప్పారు. ఓక్లహోమాలోని తుల్సా ఆసుపత్రిలో ఓ వ్యక్తి.. నలుగురిని చంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగిన రెండు రోజులకే ఈ దాడి జరిగడం గమనార్హం.

పార్టీలో తుపాకీ మోత..
అమెరికాలో శుక్రవారం మరో చోట కాల్పుల కలకలం రేగింది. రిచ్​మోండ్​​ సమీప ప్రాంతమైన చెస్టర్​ఫీల్డ్​లో జరుగుతున్న ఓ పార్టీలోకి గుర్తు తెలియని వ్యక్తి వెళ్లి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా.. ఐదుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: చర్చి బయట తుపాకీ మోత.. ఇద్దరు మహిళలు మృతి.. నిందితుడు కూడా!

100 రోజుల యుద్ధం.. వేల మంది బలి- అంతా విధ్వంసం.. ఆపేదే లేదన్న పుతిన్

Last Updated : Jun 4, 2022, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.