ETV Bharat / international

Jaishankar UNGA Speech : 'రాజకీయాల కోసం ఉగ్రవాదాన్ని అనుమతించొద్దు'.. కెనడాకు పరోక్షంగా జైశంకర్​ చురకలు - జైశంకర్ ఐక్యరాజ్యసమితి స్పీచ్

Jaishankar UNGA Speech : కెనడాతో దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో పరోక్షంగా ఆ దేశంపై విమర్శలు గుప్పించారు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. ఉగ్రవాదం, తీవ్రవాదం, హింసకు ప్రతిస్పందనలను నిర్ణయించడానికి రాజకీయ సౌలభ్యాన్ని అనుమతించవద్దని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలను కోరారు.

Jaishankar UNGA Speech
Jaishankar UNGA Speech
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 8:32 PM IST

Updated : Sep 26, 2023, 10:22 PM IST

Jaishankar UNGA Speech : ఉగ్రవాదం, తీవ్రవాదం, హింసకు ప్రతిస్పందనలను నిర్ణయించడానికి రాజకీయ సౌలభ్యాన్ని అనుమతించవద్దని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలను కోరారు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఉండకూడదన్న విషయం కొన్ని దేశాలకే పరిమితం కాకూడదని పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌ అంశంపై ఇటీవల పాకిస్థాన్‌ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్‌-ఉల్‌-హక్‌ కాకర్‌ ఐరాసలో చేసిన వ్యాఖ్యలు, కెనడాతో దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో పరోక్షంగా ఆ దేశాలపై ఆయన విమర్శలు గుప్పించారు. 78వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాన్ని ఉద్దేశించి జైశంకర్ మాట్లాడారు. భారత్ 'అమృత్ కాల్'లోకి ప్రవేశించిందని చెప్పిన ఆయన... చంద్రయాన్‌-3 తో ప్రపంచం భారత్‌ వైపు చూసిందన్నారు.

  • #WATCH | EAM Dr S Jaishankar on Chandrayaan-3 mission at the United Nations General Assembly in New York

    "India has entered the 'Amrit Kaal'...The world saw a glimpse of what is to come when our Chandrayaan-3 landed on the Moon. Today, our message to the world is in digitally… pic.twitter.com/nvh3nBA3ih

    — ANI (@ANI) September 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"భారత్‌ 'అమృత్ కాల్'లోకి ప్రవేశించింది. చంద్రయాన్-3 జాబిల్లిపై ల్యాండ్ అయినప్పుడు ప్రపంచం ఏమి జరుగుతుందో అనే గ్లింప్స్ చూసింది. భారత డిజిటల్ సహిత గవర్నెన్స్, డెలివరీ విస్తృత పరిధిలో ఉంది. సౌకర్యాలు, సేవలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలు, మా శక్తివంతమైన అంకుర సంస్థలు నిర్మాణంలో ఉన్నాయని నేడు ప్రపంచానికి భారత్ సందేశం పంపుతోంది. టీకాల విషయంలో వర్ణవివక్ష వంటి అన్యాయాలను మళ్లీ అనుమతించకూడదు. వాతావరణ మార్పుల విషయంలో తప్పించుకునే ధోరణి ఉండకూడదు. పేద దేశాల నుంచి ధనిక దేశాలకు ఇంధనం, ఆహారం అందించేందుకు మార్కెట్‌ శక్తులను ఉపయోగించకూడదు. రాజకీయ సౌలభ్యం ఆధారంగా ఉగ్రవాదం, హింసపై ప్రతిస్పందించడాన్ని అనుమతించకూడదు."

--జైశంకర్, విదేశాంగ శాఖ మంత్రి

Jaishankar UNGA Address : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని జైశంకర్ అన్నారు. ప్రస్తుత సమకాలీన సమాజానికి తగ్గట్లుగా భద్రతా మండలిలో మార్పులు చేయాలన్నారు. జీ20కి అధ్యక్షత వహించిన భారత్​.. ఆఫ్రికా యూనియన్​ను శాశ్వత సభ్యుడిగా చేర్చుకుందని ఉదాహరించారు. భారతదేశం ఉద్దేశం.. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు (వన్ ఎర్త్, వన్​ ఫ్యామిలీ, వన్​ ఫ్యూచర్​) అని.. ఏ కొందరి ప్రయోజనాల కోసం పాటుపడదని చెప్పారు. 'నమస్తే ఫ్రమ్​ భారత్​' అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టి.. దాదాపు 17 నిమిషాలు మాట్లాడారు జైశంకర్.

India Canada Row : కెనడా అంశంలో విచారణకు సహకరించాలన్న అమెరికా.. భారత్‌కు మద్దతుగా శ్రీలంక

POK Protest Against Pakistan : 'POKను పాకిస్థాన్​ ఖాళీ చేయాల్సిందే'.. ఐరాస వద్ద కశ్మీర్‌ ప్రజల నిరసన!

Last Updated : Sep 26, 2023, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.