ETV Bharat / international

భారీగా హమాస్​ ఆయుధాలు స్వాధీనం- ఆస్పత్రి, స్కూల్​ వద్దే!- ఆ డౌట్​తో ఇజ్రాయెల్​ భీకర దాడులు - హమాస్​పై భీకర దాడులు

Israel War Hamas Weapons : ఉత్తర గాజాలో హమాస్‌కు చెందిన అతిపెద్ద ఆయుధ నిల్వను గుర్తించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఆస్పత్రి, పాఠశాలకు సమీపంలోనే ఆయుధాలను కనుగొన్నట్లు పేర్కొంది. హమాస్‌కు చెందిన కీలక నేతలు దక్షిణ గాజాలో ఉంటారనే అనుమానంతో ఆ ప్రాంతంలో దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్‌ దాడుల్లో 24 గంటల్లో సెంట్రల్ గాజాలో 73 మంది చనిపోయారని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది.

Israel Hamas War Weapons
Israel Hamas War Weapons
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 10:33 PM IST

Israel War Hamas Weapons : ఉత్తర గాజాలో హమాస్‌కు చెందిన అతిపెద్ద ఆయుధ నిల్వను గుర్తించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. RPG మిస్సైళ్లు, యాంటీ ట్యాంక్ క్షిపణులు, పేలుడు పదార్థాలు, రాకెట్లు, గ్రెనేడ్లు, డ్రోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఆయుధాలను ఓ పాఠశాల, ఆస్పత్రికి సమీపంలో గుర్తించినట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. ఇజ్రాయెల్‌పై ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచిన మిస్సైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పౌరులు నివాసాలకు సమీపంలోనే ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను సైతం గుర్తించినట్లు చెప్పారు. యుద్ధంలో పాలస్తీనియన్లను హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ కవచాలుగా వాడుకుంటోందనడానికి ఇదొక ఆధారమని అన్నారు.

దక్షిణ గాజాలో హమాస్‌కు చెందిన సీనియర్ నాయకులు ఉండొచ్చనే అనుమానంతో ఇజ్రాయెల్‌కు చెందిన బలగాలు ఆ ప్రాంతంపై భీకరంగా దాడులు చేస్తున్నాయి. హమాస్‌ గ్రూప్‌ లీడర్ సిన్వర్, మిలిటరీ వింగ్ కమాండర్‌ మహ్మద్ దీఫ్‌లు అక్కడే తలదాచుకొని ఉంటారని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. దక్షిణ గాజాలోని అతిపెద్ద నగరం ఖాన్‌ యూనిస్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను రఫా వైపు వెళ్లాలని ఐడీఎఫ్ తాజాగా ఆదేశించింది. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరం వద్ద కూడా ఐడీఎఫ్ దళాలు క్యాంపును ఏర్పాటు చేసుకున్నాయి. ఈ శరణార్థి శిబిరం కేంద్రంగా హమాస్ తన కార్యకలాపాలను సాగిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఈ శిబిరంలో ఎంత మంది శరణార్థులు ఉన్నారనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు.

వరుస బాంబు దాడులతో దక్షిణ గాజా నుంచి ఇప్పటి వరకు 11 లక్షల 87 వేల మంది పాలస్తీనియన్లు తమ ఇళ్లను వదిలి వెళ్లారని ఐరాస పేర్కొంది. యుద్ధం కారణంగా ప్రజలకు ఆహారం, ఔషధాలు, నిత్యావసరాలను అందించలేకపోతున్నామని తెలిపింది. మరోవైపు, 24 గంటల వ్యవధిలో సెంట్రల్ గాజాలో 73 మంది చనిపోయారని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. 123 మంది క్షతగాత్రులను అల్‌-అక్సా ఆస్పత్రికి తరలించినట్లు వివరించింది. హమాస్‌ను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ ఉండటం వల్ల ఉత్తర గాజాలో నెలకొన్న పరిస్థితులే గాజా మెుత్తం విస్తరిస్తాయని పాలస్తీనియన్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉత్తర గాజాలోని అనేక ప్రాంతాలలో శిథిలాల కుప్పలే దర్శనమిస్తున్నాయి.

'యుద్ధం తర్వాత ప్రజల సేఫ్టీ ముఖ్యం- ఇజ్రాయెల్​ సరిహద్దుల్లో గట్టి భద్రత!'

ఖాన్‌ యూనిస్‌ రక్తసిక్తం- భారీగా బాంబు దాడులు- సొరంగాల్లో నీళ్లు నింపుతున్న ఇజ్రాయెల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.