ETV Bharat / international

శిథిలాల దిబ్బగా గాజా- స్కూల్​పై ఇజ్రాయెల్​ దాడిలో 15 మంది మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 10:59 PM IST

Updated : Nov 5, 2023, 6:35 AM IST

Israel Hamas War : ఇజ్రాయెల్‌ సేనల దాడులతో గాజా శిథిలాల దిబ్బగా మారుతోంది. ఇప్పటివరకు మృతి చెందిన వారిసంఖ్య 9,488కు చేరింది. అందులో 3,900 మంది చిన్నారులు ఉన్నారు. వైమానిక దాడుల్లో హమాస్‌ బహిష్కృత నేత నివాసం ధ్వంసమైనట్లు పాలస్తీనా మీడియా ప్రకటించింది.

Israel Hamas War
Israel Hamas War

Israel Hamas War : అక్టోబరు 7న హమాస్‌ జరిపిన మెరుపు దాడులకు ప్రతీకారంగా.. గాజాలో ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. హమాస్‌ మిలిటెంట్లు, వారి స్థావరాలే లక్ష్యంగా భూతల, వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో పెద్దసంఖ్యలో ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడిచే ఓ పాఠశాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో 15 మంది మరణించారు. మరో 70మంది గాయపడినట్లు గాజా వైద్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Israel Palestine War Latest News : మరోవైపు ఉత్తర గాజాలోని పౌరులు దక్షిణ గాజాకు తరలిపోవాలని ఇజ్రాయెల్‌ సైన్యం మరోసారి హుకుం జారీ చేసింది. ప్రాణాలతో ఉండాలంటే.. మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల సమయంలో తాము సూచించిన మార్గం గుండా వెళ్లిపోవాలని సూచించింది. అయితే దక్షిణ గాజాలో ఉన్నా కూడా దాడులు జరుగుతుండటం వల్ల ప్రజలు తిరిగి ఉత్తర గాజా వైపు వెళ్లిపోతున్నారు.

Israel Attack on Lebanon : శరణార్థి శిబిరంలో ఉన్న హమాస్‌ బహిష్కృత నేత ఇస్మాయెల్‌ నివాసాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది. మరోవైపు.. ఇజ్రాయెల్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు నిలిపివేస్తున్నట్లు తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ స్పష్టం చేశారు. గాజాలో జరుగుతున్న నరమేథానికి బాధ్యుడైన నెతన్యాహుతో.. ఎలాంటి చర్చలు ఉండవని ప్రకటించారు. ఇజ్రాయెల్‌లోని తమ రాయబారిని వెనక్కి పిలిపించినట్లు తుర్కియే స్పష్టం చేసింది. లెబనాన్‌తో సరిహద్దు కలిగిన ప్రాంతాల్లోని హిజ్బుల్లా శిబిరాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. అంతకుముందు ఇజ్రాయెల్‌ సైనిక శిబిరాలపై హిజ్బుల్లా మిలిటెంట్లు దాడులు చేయటం వల్ల ప్రతీకార చర్యలకు దిగింది. ఇప్పటివరకు మృతి చెందిన వారిసంఖ్య 9,488కు చేరింది. అందులో 3,900 మంది చిన్నారులు ఉన్నారు.

Israel Attack on Hospital Gaza : గాజాలోని అల్‌ షిఫా ఆస్పత్రి వెలుపల అంబులెన్స్‌ల కాన్వాయ్‌పై వైమానిక దాడి జరగడంపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అంబులెన్స్ కాన్వాయ్‌పై దాడి ఘటనతో తాను తీవ్ర భయాందోళనకు గురయ్యానని ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ తెలిపారు. అల్‌ షిఫా ఆసుపత్రి వద్ద రహదారులపై చల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల చిత్రాలు భయానకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రులను ఆహారం, నీరు, ఔషధ, ఇంధన కొరతలు తీవ్రంగా వేదిస్తున్నాయని అక్కడి భయంకర మానవతా సంక్షోభాన్ని గుటెర్రెస్ నొక్కిచెప్పారు. ఆస్పత్రుల్లోని శవాగారాలన్నీ మృతదేహాలతో నిండిపోయాయన్నారు. పిల్లలకు రోగాలు, శ్వాసకోశ వ్యాధుల ప్రబలే అవకాశం ఉందని ఐరాస హెచ్చరించింది. ఇప్పటికైనా బందీలను బేషరతుగా విడిచిపెట్టాలని హమాస్‌కు స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి చీఫ్‌ వ్యాఖ్యలపై ఐరాసలోని ఇజ్రాయెల్‌ శాశ్వత ప్రతినిధి ఎర్డాన్‌ మండిపడ్డారు. గుటెరస్‌ నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు.

ఆస్పత్రి ప్రాంగణంపై ఇజ్రాయెల్​ రాకెట్ల దాడి- అంబులెన్స్​లు ధ్వంసం, అనేక మంది రోగులు మృతి

హమాస్​ కమాండర్​ను హతమార్చిన ఇజ్రాయెల్​- ఆగని భీకర దాడులు

Last Updated : Nov 5, 2023, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.