ETV Bharat / international

Israel Hamas War 2023 : ఇజ్రాయెల్​-హమాస్ యుద్ధం మరింత తీవ్రం.. గాజాపై భీకర దాడులు.. కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు ప్రజలు

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 7:26 PM IST

Israel Hamas War 2023 : ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య రాజుకున్న యుద్ధం అంతకంతకూ తీవ్రమవుతోంది. హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో విరుచుకుపడుతుండగా ఇప్పటివరకు 700 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు.. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటివరకు.. గాజాలోని 500 మందికిపైగా మృత్యువాతపడ్డారు. హమాస్​ మిలిటెంట్లనే ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. గాజాలోని పౌరులూ తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. ఇజ్రాయెల్‌ చేసే బాంబు దాడులతో గాజా స్ట్రిప్‌ దద్దరిల్లుతోంది.

Etv Bharat
Etv Bharat

Israel Hamas War 2023 : ఇజ్రాయెల్‌పై హమాస్‌ తీవ్రవాదులు మెరుపుదాడితో రాజుకున్న యుద్ధం వందలాది మంది ప్రాణాలను బలిగొంటూనే ఉంది. ఇజ్రాయెల్‌లోకి చొరబడి సుమారు 130 ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్న హమాస్‌ మిలిటెంట్లు పెద్దఎత్తున ఇజ్రాయెల్‌ ప్రజలను బందీలుగా తీసుకొని నరమేధం సృష్టిస్తున్నారు. ఇదే సమయంలో గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి రాకెట్ల వర్షం కురుస్తూనే ఉంది. జనావాసాలపై రాకెట్లు విరుచుకుపడుతుండగా.. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. పెద్దసంఖ్యలో క్షతగాత్రులు అవుతున్నారు. జెరూసలేం, టెల్‌ అవీవ్‌పైనా రాకెట్ల దాడి జరుగుతుండగా, ఆయా ప్రాంతాల్లో ఎయిర్‌ రెయిడ్ సైరన్ల మోతమోగుతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఇజ్రాయెల్ సైన్యం అప్రమత్తం చేసింది.

దేశంలోకి చొరబడిన మిలిటెంట్లను మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్ సైన్యం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సుశిక్షితులైన సైనికులను రంగంలోకి దించగా పలు ప్రాంతాల్లో భీకర పోరు కొనసాగుతోంది. పాలస్తీనా సరిహద్దులను అన్నివైపుల నుంచి దిగ్బంధిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం విద్యుత్‌ నిలిపివేయడం సహా ఆహార పదార్థాలు, ఇంధన సరఫరాను అడ్డుకునే దిశగా చర్యలు చేపట్టింది. గాజాతో సరిహద్దులన్నింటిపై పూర్తిస్థాయిలో పట్టు సాధించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఆయాచోట్ల ప్రస్తుతం ఎలాంటి యుద్ధం జరగడం లేదని తెలిపింది.

సరిహద్దుల్లోని ఐదు పట్టణాల ప్రజలను చాలావరకు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వివరించింది. సరిహద్దులోకి మిలిటెంట్లు చొరబడకుండా యుద్ధ ట్యాంకులు, డ్రోన్లను మోహరించింది. శనివారం నాటి దాడిలో వెయ్యి మంది మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించినట్లు అంచనా వేసిన సైన్యం.. వారిని ఏరివేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు 400 మందిని చంపామని, పెద్దసంఖ్యలో బందీలుగా తీసుకున్నామని వివరించింది. ఇదే సమయంలో మిలిటెంట్లు బందీలుగా తీసుకున్నవారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు.. పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. 3లక్షల మంది రిజర్వు బలగాలను కూడా రంగంలోకి దించినట్లు తెలిపింది.

మరోవైపు.. గాజాలోని బీట్‌ హనౌన్‌ నుంచి హమాస్‌ మిలిటెంట్లు రాకెట్లు ప్రయోగిస్తుండగా, ఆ పట్టణంలోని వెయ్యికిపైగా లక్ష్యాలపై క్షిపణి దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. ఇందులో హమాస్ సైనిక, నౌకాదళం ప్రధాన కార్యాలయాలు, మిలిటెంట్ల నివాస భవన సముదాయాలు ఉన్నట్లు వెల్లడించింది. జబాలియా ప్రాంతంలోని కీలక స్థావరాన్ని కూడా ధ్వంసం చేసినట్లు తెలిపింది. గాజాలో హమాస్‌ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యుద్ధం కొనసాగిస్తామని ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. భవిష్యత్‌లోనూ ఇజ్రాయెల్‌పై ఎలాంటి దాడులు చేయకుండా హమాస్ సైనిక సామర్థ్యాలను పూర్తి ధ్వంసం చేస్తామని ప్రతినబూనింది.

Israel Hamas War 2023
గాజాలో ధ్వంసమైన భవనాలు

హమాస్‌ మాత్రం తమ సాయుధులు పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారని ప్రకటించింది. ఈ ఉదయం వరకు పెద్దసంఖ్యలో ఇజ్రాయెల్‌ వాసులను బంధీలుగా తీసుకున్నట్లు హమాస్ ప్రతినిధి ప్రకటించారు. ఇజ్రాయెల్‌లో ఉన్న పాలస్తీనావాసులను విడిపించుకోవడమే తమ లక్ష్యమని హమాస్‌ ప్రతినిధి స్పష్టం చేశారు.

'గాజాలో విధ్వంసమే'
US Sends Troops To Israel : ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో గాజాస్ట్రిప్‌లో ఎక్కడ చూసినా విధ్వంసమే కనిపిస్తోంది. హమాస్‌ మిలిటెంట్‌ సంస్థపై ఇజ్రాయెల్‌ చేస్తున్న ప్రతీకార దాడుల్లో గాజాస్ట్రిప్‌లో ఊహకందని నష్టం జరుగుతోంది. మిలిటెంట్లనే ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. గాజాలోని పౌరులూ తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. ఇజ్రాయెల్‌ చేసే బాంబు దాడులతో గాజా స్ట్రిప్‌ దద్దరిల్లుతోంది. ఇజ్రాయెల్‌ దాడులతో గాజా ప్రజల బాధ వర్ణనాతీతంగా మారింది. ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఎప్పుడు ఏ బాంబు వచ్చి పడుతుందో తెలీక భయంతో బతుకుతున్నారు. ధ్వంసమైన భవనాల శిథిలాల కింద పిల్లల పుస్తకాలు, బొమ్మలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఇతర ఫర్నిచర్‌ వంటివి కనిపించాయి. వేలాది వాహనాలు చెల్లాచెదురుగా రహదారులపై పడి ఉన్నాయి. కట్టుబట్టలతో పసిపిల్లలను తీసుకుని స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. గాజాలో లక్షమందికిపైగా నిరాశ్రయులైనట్లు సమాచారం. వారికంటూ ఓ సురక్షిత ప్రాంతం లేకుండా పోయింది. ఆహారం ఇతర అవసరాలు ఎలా అన్నది కూడా తెలీక ప్రజలు అలమటిస్తున్నారు. బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వీల్లేకుండా సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.

Israel Hamas War 2023
గాజాలో ధ్వంసమైన భవనాలు

అటు ఇజ్రాయెల్‌ సైన్యం దాడులతో పెద్దసంఖ్యలో పాలస్తీనావాసులు చెల్లాచెదురయ్యారు. లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. గాజాలో ఉన్న ప్రజలు కూడా ప్రాణభయంతో కాలం వెళ్లదిస్తున్నట్లు వివరించింది. ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగిస్తున్న క్షిపణుల కారణంగా 160కిపైగా నివాస భవనాలు నేలమట్టమయ్యాయని, 12వందలకుపైగా భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించింది. 225 మంది ఆశ్రయం పొందుతున్న పాఠశాల భవనంపై ఓ క్షిపణి పడినట్లు తెలిపింది. మరోవైపు.. యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్, పాలస్తీనాను ఈజిప్ట్‌ కోరింది. ఈ మేరకు రెండు పక్షాలతో మాట్లాడినట్లు వెల్లడించింది. అయితే ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదని పేర్కొంది.

Israel Hamas War 2023
గాజాలో రోడ్డుపై కూర్చున్న పౌరులు

'ఇజ్రాయెల్​కు అండగా అమెరికా'
హమాస్‌ మిలిటెంట్‌ సంస్థపై పోరులో ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉంటామని ప్రకటించిన అగ్రరాజ్యం అమెరికా.. అత్యాధునిక విమాన వాహక నౌకను ఆ దేశ సరిహద్దులకు పంపింది. USS గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ అనే ఈ విమాన వాహకనౌకను మధ్యధరా సముద్రానికి చేరింది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ కెరియర్‌లో 5వేల మంది నౌకాదళ సిబ్బందితో పాటు, డెక్‌ నిండా యుద్ధవిమానాలు, మందుగుండు సామగ్రి ఉన్నాయి.

USS గెరాల్డ్‌ ఆర్‌ఫోర్డ్‌తో పాటు గైడెడ్‌ మిసైళ్లను ప్రయోగించగల సామర్థ్యం కలిగిన USS నార్మండి, విధ్వంసక యుద్ధనౌకలైన థామస్‌ హడ్‌నర్‌, USS రమెజ్‌, USS కార్నె , అణు సామర్థ్యం కలిగిన వాహక నౌక USS రూజ్‌వెల్ట్‌లను అగ్రరాజ్యం పంపింది. వీటిలో అధునాతన యుద్ధ విమానాలు ఎఫ్‌-35, ఎఫ్‌-15, ఎఫ్‌-16లతో పాటు సబ్ సోనిక్‌ అటాక్‌ చేయగల ఏ-10 యుద్ధ విమానాలను మోహరించారు. ఇజ్రాయెల్‌కు కావలసిన అత్యవసర పరికరాలను, మందుగుండు సామగ్రిని పంపింస్తున్నామని.. మొదటి విడతగా కొన్ని పంపించామని అమెరికా తెలిపింది. హమాస్‌ మిలిటెంట్‌ దాడుల్ని తిప్పికొట్టడానికి, నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు వీటిని పంపినట్లు అగ్రరాజ్యం తెలిపింది.

Israel Hamas War : భీకర యుద్ధం.. 1100మందికిపైగా మృతి.. చిక్కుకున్న 18వేల మంది భారతీయులు!

Israel Palestine Conflict : ఇజ్రాయెల్​-పాలస్తీనా గొడవకు కారణం ఇదే!.. 'హమాస్​' ఎలా ఏర్పడిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.