ETV Bharat / international

ఇజ్రాయెల్​లో కరోనా టీకా పంపిణీ షురూ

వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది ఇజ్రాయెల్​. రోజుకు 60వేల మందికి టీకా వేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోగ్య కార్యకర్తలకు తొలి ప్రాధాన్యతనివ్వనుంది. అయితే ఇజ్రాయెల్​లో చాలా మంది టీకా తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. ఈ తరుణంలో స్వయంగా ఆ దేశ ప్రధానే తొలి టీకా వేయించుకుని... అది సురక్షితమేనని బహిరంగంగా స్పష్టం చేశారు.

Israel begins virus inoculation drive as infections surge
కరోనా టీకా పంపిణీని ప్రారంభించిన ఇజ్రాయెల్​
author img

By

Published : Dec 20, 2020, 2:14 PM IST

ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా కరోనా టీకాలను తమ ప్రజలకు అందిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్​, అమెరికాలు ఈ ప్రక్రియ చేపట్టాయి. తాజాగా ఈ జాబితాలోకి ఇజ్రాయెల్​ చేరింది. ఆదివారం ప్రారంభమైన టీకా పంపిణీ ప్రక్రియలో.. రోజుకు 60వేల మందికి వ్యాక్సినేషన్​ చేయించాలని లక్ష్యాంగా పెట్టుకుంది ఆ దేశ ప్రభుత్వం.

కొవిడ్ పోరాటంలో ముందుండే వైద్య, ఆరోగ్య కార్యకర్తలకు టీకా పంపిణీలో తొలి ప్రాధాన్యతను ఇవ్వనుంది ఇజ్రాయెల్​. ఆ తరువాత కరోనా ముప్పు అధికంగా ఉన్న ప్రజలకు అందివ్వనుంది.

90 లక్షల మంది జనాభా ఉన్న ఇజ్రాయెల్​లో.. ప్రజలకు సరిపడా డోసులను కొనుగోలు చేసినట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. 80లక్షల టీకాలు పొందేందుకు ఫైజర్​తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది ఇజ్రాయెల్​. ఈ నెలలో మోడెర్నాతో 60లక్షల వ్యాక్సిన్లను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది.

రంగంలోకి ప్రధాని...

ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. టీకాను తీసుకునేందుకు ప్రజలు వెనుకంజ వేస్తున్నారని పలు సర్వేలు తెలిపాయి. వ్యాక్సిన్​ వేయించుకోమని చాలా మంది తేల్చిచెబుతున్నారని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా ఆ దేశ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు రంగంలోకి దిగారు. టీకా సురక్షితమేనని.. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని చెప్పి.. బహిరంగంగా టీకా తీసుకున్నారు. ఆ దేశంలో తొలి టీకా వేయించుకున్నది కూడా నెతన్యాహునే.

ఇదీ చూడండి: 'భారతీయులందరికీ టీకా అందేది అప్పుడే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.