ETV Bharat / international

Iraq Wedding Hall Fire : వెడ్డింగ్​ హాల్​లో భారీ అగ్నిప్రమాదం.. 114మంది మృతి.. మరో 150 మంది..

Iraq Wedding Hall Fire
Iraq Wedding Hall Fire
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2023, 6:13 AM IST

Updated : Sep 27, 2023, 11:25 AM IST

06:12 September 27

Iraq Wedding Hall Fire : వెడ్డింగ్​ హాల్​లో భారీ అగ్నిప్రమాదం.. 114మంది మృతి.. మరో 150 మంది..

Iraq Wedding Hall Fire : ఇరాక్‌లోని ఓ పెళ్లి మండపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 114 మంది మృతి చెందగా.. 150 మంది గాయపడ్డారు. ఉత్తర ఇరాక్​లోని నినెవే ప్రావిన్స్‌లోని హమ్దానియా ప్రాంతంలో బుధవారం ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. రాజధాని బాగ్దాద్​కు వాయువ్యంగా 335 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు.

Fire At Wedding Hall : ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నట్లు నినెవే ప్రావిన్స్‌ గవర్నర్​ నజిమ్​ అల్​ జుబౌరీ వెల్లడించారు. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టినట్లు, గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించినట్లు చెప్పారు. మంటలు భారీగా చెలరేగడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇరాక్​ మీడియా ద్వారా ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైఫ్ అల్-బదర్.. ఘటనను ధ్రువీకరించి ప్రాణ నష్టాన్ని ప్రకటించారు. అన్ని సహాయక చర్యలు జరుగుతున్నట్లు వెల్లడించారు.

ప్రధాని స్పందన..
భారీ అగ్నిప్రమాదంపై ఇరాక్ ప్రధాన మంత్రి మహ్మద్​ అల్ సూదానీ స్పందించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

Iraq Fire Accident : అయితే ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పెళ్లి మండపంలో బాణాసంచా భారీగా కాల్చడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని కుర్దిష్​ టెలివిజన్​ ఛానెల్​ అనుమానం వ్యక్తం చేసింది. మంటలు చెలరేగగానే హాల్​ పాక్షికంగా కుప్పకూలిందని పౌర రక్షణ అధికారులు తెలిపారు. భారీ మంటలకు ధ్వంసమయ్యే నాసిరక మెటీరియల్​తో ఈ భవనం నిర్మించినట్లు చెప్పారు. పెళ్లి మండపంలో అగ్నిమాపక పరికరాలు లేకపోవడం వల్లే మంటలు భారీగా వ్యాపించినట్లు కొందరు చెబుతున్నారు.

Last Updated : Sep 27, 2023, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.