ETV Bharat / international

యూనివర్సిటీ హాస్టల్​లో భారీ అగ్నిప్రమాదం- 14 మంది మృతి - mexico fight today

Iraq University Fire Accident : ఓ యూనివర్సిటీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటన ఇరాక్‌లోని సోరన్‌ యూనివర్సిటీ వసతి గృహంలో జరిగింది.

Iraq University Fire Accident
Iraq University Fire Accident
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 6:24 AM IST

Updated : Dec 9, 2023, 8:48 AM IST

Iraq University Fire Accident : ఇరాక్‌లోని ఓ యూనివర్సిటీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. ఇర్బిల్‌ నగరంలో సోరన్‌ యూనివర్సిటీలోని వసతిగృహంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఆ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారని అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల నివాసితులను ఖాళీ చేయించినట్లు వెల్లడించారు. ఈ వసతిగృహంలో విద్యార్థులు, లెక్చరర్లు కలిసి ఉంటారని అధికారులు తెలిపారు.

ప్రధాని తీవ్ర సంతాపం, దర్యాప్తునకు ఆదేశం
Iraq Fire Accident Today : శుక్రవారం రాత్రి వసతి గృహంలోని మూడు, నాలుగు అంతస్థుల్లో మంటలు చేలరేగినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. అయితే, విద్యుత్ షార్ట్ సర్క్యూట్​ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంపై కుర్దిస్థాన్​ ప్రధానమంత్రి మస్రౌర్​ బర్జానీ సంతాపం వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

గ్రామస్థులు, ముఠా మధ్య కాల్పుల్లో 11 మంది మృతి
మెక్సికోలో ఓ క్రిమినల్​​ ముఠా, గ్రామస్థులకు మధ్య జరిగిన ఘర్షణలో 11 మంది మరణించారు. ఇందులో 8 మంది ముఠాకు చెందినవారు కాగా, మరో ముగ్గురు గ్రామస్థులు ఉన్నారు. ఈ ఘటన మెక్సికోకు 130 కిలోమీటర్ల దూరంలోని టెక్సాకాల్టిట్లన్​ సమీపంలో జరిగింది. అయితే, పోలీసులు వారిని క్రిమినల్​ ముఠాగా గుర్తించలేదు. కానీ ఆ ప్రాంతంలో డ్రగ్స్​ ముఠా ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్​ మీడియాలో ప్రత్యక్షమైంది. మిలిటరీ తరహా దుస్తులు, హెల్మెట్లు ధరించిన వారు దాడి చేసినట్లు ఆ వీడియోలో కనిపించింది. అయితే, గ్రామస్థులను బెదిరించి బలవంతపు వసూళ్లు చేస్తున్న క్రమంలో ఘర్షణ తలెత్తిందని స్థానిక మీడియా వెల్లడించింది. దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

అదుపుతప్పి లోయలో పడ్డ బస్సు- 16 మంది మృతి

దక్షిణ గాజాపై ఇజ్రాయెల్​ భీకర దాడులు- 5వేల మంది ఉగ్రవాదులు హతం- ఇళ్లను వీడిన 18లక్షల మంది పౌరులు!

Last Updated : Dec 9, 2023, 8:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.