ETV Bharat / international

భారతీయుల విమానానికి లైన్‌క్లియర్‌- ఎయిర్​పోర్ట్​లోనే విచారణ, ఇండియాకు వస్తుందా?

Indians In France Human Trafficking : మానవ అక్రమ రవాణా అనుమానంతో 303 మంది భారతీయ ప్రయాణికులున్న విమానాన్ని ఫ్రెంచ్​ అధికారులు అధీనంలోకి తీసుకున్న ఘటనలో పురోగతి లభించింది. మూడు రోజుల నిర్బంధం అనంతరం ఈ విమానం సోమవారం ఉదయం మళ్లీ బయలుదేరనుంది.

Indians In France Human Trafficking
Indians In France Human Trafficking
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 7:09 AM IST

Updated : Dec 25, 2023, 9:09 AM IST

Indians In France Human Trafficking : మానవ అక్రమ రవాణా అనుమానంతో ఫ్రాన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్న 303 మంది భారతీయ ప్రయాణికులున్న విమానానికి ఆటంకాలు తొలిగాయి. మూడు రోజులు నిర్బంధం అనంతరం ఈ విమానం సోమవారం మళ్లీ బయలుదేరనుంది. అయితే షెడ్యూల్ ప్రకారం నికరాగువాకు వెళుతుందా? వెనక్కి మళ్లించి దుబాయికి చేరుతుందా లేదా భారత్‌కు పయనం అవుతుందా? అన్నది అధికారులు వెల్లడించలేదు.

విచారణ జరిపిన నలుగురు న్యాయమూర్తుల ప్యానెల్
ఫ్రెంచ్‌ నిబంధనల ప్రకారం ఈ ఘటనపై ఆదివారం న్యాయవిచారణ ప్రారంభమైంది. విమానాన్ని అధీనంలోకి తీసుకున్న వాట్రీ విమానాశ్రయంలోనే న్యాయవిచారణకు ఫ్రాన్స్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నలుగురు న్యాయమూర్తుల ప్యానల్‌ బహిరంగ విచారణ చేపట్టారు. అనంతరం విమానం బయలుదేరేందుకు అనుమతులు రావడం వల్ల విచారణ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని జడ్జీలు హియరింగును రద్దు చేశారు. విమాన ప్రయాణికుల్లో కొందరు తమ బంధువులతో ఫోన్లలో హిందీ, తమిళంలో మాట్లాడారని ఫ్రెంచ్ మీడియా పేర్కొంది. ఓ కంపెనీ క్లయింట్ కోసం విమానాన్ని నడిపామని, మానవ అక్రమ రవాణా అరోపణలతో తమకు సంబంధం లేదని రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్‌కు న్యాయవాది తెలిపారు.

ఫ్రాన్స్ చట్టాల ప్రకారం!
ఫ్రాన్స్‌ చట్టాల ప్రకారం విదేశీయులను ఫ్రెంచ్‌ సరిహద్దు పోలీసులు 4రోజుల వరకు తమ అధీనంలో ఉంచుకోవచ్చు. జడ్జి అనుమతిస్తే దీన్ని మరో నాలుగు రోజులు పొడిగించవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో గరిష్ఠంగా 26 రోజులకు మించి విదేశీయులను అదుపులో ఉంచుకోకూడదు. మానవ అక్రమ రవాణా రుజువైతే ఆ నేరానికి 20 ఏళ్ల క్రిమినల్‌ జైలుశిక్ష, 30 లక్షల యూరోలు (రూ.27.5 కోట్లు) జరిమానా విధిస్తుంది ఫ్రాన్స్ ప్రభుత్వం.

మానవ అక్రమ రవాణా ఆరోపణలతో!
రొమేనియాకు చెందిన లెజెండ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ నుంచి నికరాగువాకు బయలుదేరింది. ఇంధనం నింపడం కోసం శుక్రవారం ఫ్రాన్స్‌లోని వాట్రీ ఎయిర్‌పోర్టులో దిగింది. అప్పటికే మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం అందుకున్న ఫ్రాన్స్‌ అధికారులు ఈ విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

Last Updated : Dec 25, 2023, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.