ETV Bharat / international

Indian Origin World Leaders : ఏ దేశమేగినా.. 'అధినేతలు' మన వాళ్లే.. ప్రపంచ రాజకీయాల్లో భారతీయులదే హవా! - భారత సంతతి ప్రముఖులు రిషి సునాక్​

Indian Origin World Leaders : సింగపూర్ అధ్యక్షుడిగా థర్మన్ షణ్ముగరత్నం గెలుపొందడం.. వివిధ దేశాల రాజకీయాల్లో భారత సంతతి వారి పాత్రను మరోసారి చాటింది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌, ఐర్లాండ్‌, కెనడా వంటి దేశాల్లో ఉపాధ్యక్ష, ప్రధానమంత్రి, మంత్రి పదవుల్లో భారతీయ సంతతికి చెందిన వారే చక్రం తిప్పుతున్నారు. ప్రపంచ సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో భారతీయ మూలాలు ఉన్న వారు తమదైన ముద్ర వేస్తున్నారు . ఈ నేపథ్యంలో వివిధ దేశాలో అత్యన్నత పదవులు చేపట్టిన భారత సంతతి ప్రముఖుల విశేషాలను ఒక పరిశీలిద్దాం.

Indian Origin World Leaders
Indian Origin World Leaders
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 7:28 AM IST

Updated : Sep 3, 2023, 8:47 AM IST

Indian Origin World Leaders : అంతర్జాతీయ సంస్థలు, వివిధ దేశాల రాజకీయాల్లో భారతీయ సంతతికి చెందిన వారు చెరగని ముద్ర వేస్తున్నారు. ఆయా దేశాల ఎన్నికల్లో పోటీ చేసి అత్యున్నత పదవులు అధిష్టిస్తున్నారు. తాజాగా సింగపూర్‌ అధ్యక్షుడిగా భారత మూలాలున్న థర్మన్‌ షణ్ముగరత్నం ఎన్నికయ్యారు. అమెరికాలో భారతీయ- అమెరికన్ల ప్రభావం పెరుగుతోందనడానికి ఉపాధ్యాక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌ విజయాన్ని ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు.

Indian Origin World Leaders
సింగపూర్‌ అధ్యక్షుడు థర్మన్‌ షణ్ముగరత్నం

Kamala Harris Origin : 2017 నుంచి 2021 వరకు సెనేటర్‌గా ఉన్న కమలా హారిస్‌ జమైకా, భారతీయ మూలాలున్న డొనాల్డ్‌ జె హారిస్, శ్యామలా గోపాలన్‌ దంపతులకు జన్మించారు. గతేడాది నవంబరులో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున ఐదుగురు భారతీయ-అమెరికన్లు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, వివేక్‌ రామస్వామి పోటీ పడుతున్నారు.

Indian Origin World Leaders
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌
Indian Origin World Leaders
వివేక్‌ రామస్వామి

Rishi Sunak Origin Parents : భారత్‌ను 200 ఏళ్లు పాలించిన బ్రిటన్‌కు ప్రధానిగా భారతీయ మూలాలున్న రిషి సునాక్ ఎన్నికయ్యారు. 210 ఏళ్ల బ్రిటన్ రాజకీయ చరిత్రలో చిన్న వయసులోనే ప్రధానిగా ఎన్నికై రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. గోవా మూలాలున్న సుయెల్లా బ్రేవర్మన్‌, క్లైర్‌.. రిషి సునాక్ కేబినెట్‌లో హోంశాఖ, ఇంధన భద్రత శాఖ మంత్రులుగా కొనసాగుతున్నారు. బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వంలో ప్రీతి పటేల్‌ హోం సెక్రటరీగా పనిచేశారు. ఐర్లాండ్‌ ప్రధానమంత్రి లియో ఎరిక్‌ వరద్కర్ కూడా భారతీయ మూలాలు ఉన్న వ్యక్తే. ఆయన తండ్రి ఆశోక్‌ ముంబయిలో జన్మించగా... 1960లో ఇంగ్లాండ్‌కు వలస వెళ్లారు.

Indian Origin World Leaders
బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్​

Antonio Costa Indian Origin : 2015 నుంచి పోర్చుగల్ ప్రధానమంత్రిగా ఉన్న ఆంటోనియో కోస్టాకు కూడా భారతీయ మూలాలు ఉన్నాయి. కెనడాలో ఫెడరల్ మంత్రి అయిన మొదటి హిందువుగా అనితా ఆనంద్ నిలిచారు. కేబినెట్‌ పునర్వ్యస్థీకరణలో భాగంగా అనిత జులై 26న ట్రెజరీ బోర్డ్‌ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అనితతో పాటు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కేబినెట్‌లో హర్జిత్‌ సజ్జన్‌, కమల్ ఖేరా అనే ఇద్దరు భారతీయ మూలాలు కలిగి ఉన్నారు. ప్రియాంక రాధాకృష్ణన్‌ న్యూజిలాండ్‌లో మంత్రి అయిన తొలి భారత సంతతి వ్యక్తిగా నిలిచారు. మలయాళ తల్లిదండ్రులకు ఆమె చెన్నైలో పుట‌్టారు. ప్రస్తుతం ప్రియాంక న్యూజిలాండ్‌ కమ్యూనిటీ, వాలంటీర్‌ సెక్టార్‌ మంత్రిగా కొనసాగుతున్నారు.

Indian Origin World Leaders
పోర్చుగల్ ప్రధానమంత్రి ఆంటోనియో కోస్టా

Indian Origin Politicians In World : ట్రినిడాడ్-టొబాగో అధ్యక్షుడిగా ఎన్నికైన క్రిస్టీన్ కార్లా కంగాలూ ఇండో- ట్రినిడాడియన్ కుటుంబంలో జన్మించారు. భారతీయ మూలాలున్న ప్రీతమ్ సింగ్ 2020 నుంచి సింగపూర్‌ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. గయానా అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్‌ ఇండో- గయనీస్‌ ముస్లిం కుటుంబంలో జన్మించారు. ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లో 200 మందికిపైగా భారత సంతతికి చెందిన వారు ప్రజా సేవలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారని 2021 ఇండియాస్పోరా గవర్నమెంట్ లీడర్స్ నివేదిక పేర్కొంది. వీరిలో 60 మందికి పైగా కేబినెట్ పదవులలో కొనసాగుతున్నారని తెలిపింది.

Last Updated : Sep 3, 2023, 8:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.