ETV Bharat / international

'నిజ్జర్​ హత్యపై ఆధారాలివ్వండి- ఉగ్రవాదానికి లైసెన్స్​లా స్వేచ్ఛ మారకూడదు!' - ఇండియా కెనడా దౌత్య వివాదం లేటెస్ట్ అప్డేట్

India Canada Issue Evidence : ఖలిస్థానీ ఉగ్రవాది హర్​దీప్ సింగ్ నిజ్జర్​ హత్య కేసులో ఆధారాలు బయటపెట్టాలని కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్​కుమార్​ వర్మ ఒట్టావాను కోరారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ కేసు దర్యాప్తునకు నష్టం జరిగిందని విమర్శించారు. మరోవైపు ఇరు దేశాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ఇంకా దౌత్యానికి ఆస్కారం ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్ అన్నారు.

India Canada Issue Evidence
India Canada Issue Evidence
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 10:40 AM IST

India Canada Issue Evidence : కెనడాతో నెలకొన్న దౌత్యపరమైన ప్రతిష్టంభనపై దిల్లీ వైఖరిని కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్​ కుమార్​ వర్మ పునరుద్ఘాటించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్​దీప్​ సింగ్ నిజ్జర్​ హత్యకు సంబంధించి భారత్​ ప్రమేయం ఉందన్న ఆరోపణలను సమర్థించే ఆధారాలను బయటపెట్టాలని కోరారు. ఇప్పటివరకు కెనడా గానీ, దాని మిత్ర దేశాలు గానీ నిజ్జర్​ హత్యకు సంబంధించిన కచ్చితమైన ఆధారాలు చూపలేదని నొక్కి చెప్పారు. అంతేకాకుండా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ కేసు దర్యాప్తునకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ మేరకు కెనడా మీడియాతో మాట్లాడిన సందర్భంగా వ్యాఖ్యానించారు.

కెనడా సమాచారం అందించలేదు..
ఈ కేసు దర్యాప్తులో వారికి (కెనడా అధికారులకు) సహాయపడటానికి తమకు నిర్దిష్టమైన సమాచారం అందించలేదని సంజయ్​ కుమార్​ తెలిపారు. 'సాక్ష్యాలు ఎక్కుడ ఉన్నాయి? దర్యాప్తు ముగిసిందా? నేను మరో అడుగు ముందుకేసి చెబుతున్నాను.. ఈ దర్యాప్తు ఇప్పటికే కలుషితమైపోయింది. భారత ఏజెంట్లు నిజ్జర్ హత్య వెనుక ఉన్నారని చెప్పడానికి ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయి' అని సంజయ్​ కుమార్​ ఆరోపించారు.

'దౌత్యవేత్తల సంభాషణలకు రక్షణ ఉంటుంది'
మరోవైపు, నిజ్జర్ హత్య కేసులో భారత్​ ఉందన్న ఆరోపణలను హైకమిషనర్ ఖండించారు. దౌత్యవేత్తల మధ్య జరిగిన సంభాషణలకు రక్షణ ఉంటుందని.. వాటిని సాక్ష్యాలుగా ఉపయోగించలేమని తెలిపారు. 'మీరు చట్ట విరుద్ధమైన ట్యాపింగ్​, సాక్ష్యాధారాల గురించి మాట్లాడుతున్నారు. ఇద్దరు దౌత్యవేత్తల మధ్య జరిగిన సంభాషణలు అన్ని అంతర్జాతీయ చట్టాల ప్రకారం సురక్షితమైనవి. మీరు ఆ సంభాషణలను ఎలా రికార్డ్​​ చేశారో నాకు చూపించండి. ఎవరైనా ఆ వాయిస్​లను మిమిక్రీ చేయలేదని నాకు చూపించండి' అని నిలదీశారు.

"కెనడాలో ఉన్న వాంటెడ్​ జాబితాలోని వారిని భారత్​కు​ అప్పగించాలని ఒట్టావాకు గత ఐదారేళ్లుగా 26 అభ్యర్థనలు చేశాం. వాటిపై కెనడా తీసుకునే చర్యల కోసం ఎదురుచూస్తున్నాం. నాతో పాటు మిగతా దౌత్యవేత్తల భద్రతపై ఆందోళనలున్నాయి. దౌత్యపరంగా ఎదురైన సమస్యలను ఇరు దేశాలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఖలిస్థాన్​ మద్దతుదారులను కెనడా నియంత్రించాలని భారత్​ ఆశిస్తోంది. భారత్​ను ముక్కలు చేయడానికి ప్రయత్నించే, భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను సవాలు చేయాలనుకుంటున్న కెనడా పౌరులు కెనడా గడ్డను ఉపయోగించడానికి ఒట్టావా అనుమతించకూడదు."
--సంజయ్ కుమార్ వర్మ, కెనడాలోని భారత హైకమిషనర్

'దౌత్యానికి ఆస్కారం ఉంది.. స్వేచ్ఛ పేరుతో అవేం పనులు!'
India Canada Issue Jaishankar Comments : భారత్​-కెనడా మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు దౌత్యానికి ఆస్కారం ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ అన్నారు. ఈ విషయంలో ఇరు పక్షాలు టచ్​లో ఉన్నాయని.. వివాదాన్ని పరిష్కరించడానికి ఒక మార్గం కనుగొంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే సార్వభౌమాధికారం, సున్నితత్వం ఒకే దారిలో ఉండకూడదని జైశంకర్ నొక్కి చెప్పారు. హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించిన లీడర్​షిప్​ సమిట్​లో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

"భారతదేశంతో సహా అనేక దేశాల్లో వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటన స్వేచ్ఛ ఉంది. కానీ అది హింస, బెదిరింపులను సమర్ధించడానికి లేదా వేర్పాటువాదం, తీవ్రవాదానికి దారితీయడానికి లైసెన్స్ లాగా మారకూడదు. కాబట్టి మేము ఎదుర్కొన్న సమస్య ఏమిటంటే, స్వేచ్ఛ పేరుతో సమర్థించే అలాంటి కార్యకలాపాలను నిజంగా చూశాం" అని ఆయన అన్నారు. అయితే ప్రపంచంలోని ప్రతి దేశాన్ని.. మీరు ఏది సరైనదని అనుకుంటున్నారు? మీకు అలా జరగాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నిస్తే సమాధానం రాదని చెప్పారు.

India Canada Visa News : కెనడాలో వీసాల జారీ ప్రారంభం.. కానీ ఓ ట్విస్ట్

India Canada Visa Issue : 'కెనడాలో భారత్​ దౌత్యవేత్తలు సేఫ్​ అనుకుంటేనే.. కొత్త వీసాల జారీ!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.