ETV Bharat / international

ప్రమాదంలో పాక్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్- హత్యకు కుట్ర!

Imran khan life threat: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఉందని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ సీనియర్ నాయకుడు ఫైసల్ వావ్డా అన్నారు. బహిరంగ సభలకు హాజరయ్యేటప్పుడు బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్‌ని ఉపయోగించమని తాను ఇమ్రాన్ ఖాన్​కు సలహా ఇచ్చానని ఫైసల్ వెల్లడించారు.

imran khan
ఇమ్రాన్​ ఖాన్
author img

By

Published : Mar 31, 2022, 7:27 AM IST

Updated : Mar 31, 2022, 3:28 PM IST

Imran khan life threat: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఉందని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ సీనియర్ నాయకుడు ఫైసల్ వావ్డా అన్నారు. ప్రధానిని హత్య చేయడానికి కొందరు ప్రణాళికలు వేస్తున్నారని తెలిపారు. బహిరంగ సభలకు హాజరయ్యేటప్పుడు బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్‌ని ఉపయోగించాలని ప్రధానికి సలహా ఇచ్చానని ఫైసల్ వెల్లడించారు. 'అల్లా ఎప్పుడు నన్ను లోకం నుంచి తీసుకెళ్లిపోతే అప్పుడే వెళ్లిపోతాను' అని ఇమ్రాన్ ఖాన్ అన్నారని ఫైసల్ తెలిపారు.

పాకిస్థాన్ ఎవరి యుద్ధంలో భాగం కాబోదని ఫైసల్​ పేర్కొన్నారు. ​ పొరుగు దేశాలపై దాడి చేయడానికి దేశంలోని ఎయిర్‌బేస్‌లను ఎవరికీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ప్రధాని ఇమ్రాన్ ధైర్యవంతుడని, దేశాన్ని ఎవరి ముందు తలవంచనివ్వడని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు మార్చి 8న ఇమ్రాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి మొత్తం 161 మంది సభ్యులు అనుకూలంగా.. ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఇమ్రాన్‌ ఖాన్‌ తంటాలు పడుతున్నారు. ఇమ్రాన్‌ను పదవి నుంచి దించాలంటే ప్రతిపక్షాలకు 172 మంది సభ్యుల మద్దతు అవసరం.

ఇదీ చదవండి: చర్చలు ముగిసిన గంటల్లోనే ఉక్రెయిన్​పై రష్యా క్షిపణి దాడులు..!

Last Updated : Mar 31, 2022, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.