ETV Bharat / international

భారత్​, బ్రిటన్​ సంబంధాలపై రిషి సునాక్​ కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Aug 24, 2022, 8:05 AM IST

Updated : Aug 24, 2022, 8:33 AM IST

Rishi Sunak on India బ్రిటన్​ ప్రధాని రేసులో ఉన్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్​ ఇరు దేశాల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్​, బ్రిటన్​ సంబంధాలను పరస్పర ప్రయోజనకరంగా మార్చాలని అనుకుంటున్నట్లు చెప్పారు. భారతీయ బ్రిటిష్​ సభ్యులతో లండన్​లో నిర్వహించిన సమావేశంలో ఇలా మాట్లాడారు.

Rishi Sunak on India
Rishi Sunak on India

Rishi Sunak on India: బ్రిటన్‌ విద్యార్థులు, కంపెనీలు భారత్‌కు సులభంగా రావడానికి రెండు దేశాల సంబంధాలను పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా మార్చాలని భావిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రధాని అభ్యర్థి రిషి సునాక్‌ తెలిపారు. కన్జర్వేటివ్‌ పార్టీలోని భారతీయ బ్రిటిష్‌ సభ్యులతో లండన్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రసంగించారు. ''ప్రస్తుతం అధిక ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి, బలమైన, సురక్షితమైన దేశాన్ని నిర్మించడానికి నన్ను ప్రధానిగా ఎన్నుకోండి. మనం బ్రిటన్‌-ఇండియాల మధ్య జీవ వారధులం. భారత్‌లో మన వస్తువులు విక్రయించడానికి, అక్కడ పనులు చేయడానికి మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ.. ఆ దేశం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. బ్రిటన్‌ విద్యార్థులు అక్కడికి వెళ్లి నేర్చుకోవాల్సిన అవసరముంది. మన కంపెనీలు, భారతీయ కంపెనీలతో కలిసి పనిచేయాల్సి ఉంది. ఈ కోణంలోనే రెండు దేశాల సంబంధాలను పరస్పర ప్రయోజనకరంగా మార్చాలని అనుకుంటున్నా'' అని వివరించారు.

''చైనా నుంచి ఎన్నో ఏళ్లుగా ఎదురవుతున్న ఆర్థిక, భద్రతాపరమైన ముప్పును బ్రిటన్‌ మరింత బలంగా ఎదుర్కోవాల్సి ఉంది. బ్రిటన్‌ ప్రధానిగా మిమ్మల్ని, మీ కుటుంబాలను సురక్షితంగా ఉంచడం నా ప్రథమ కర్తవ్యం'' అని సునాక్‌ తెలిపారు. తన ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌ పన్నుల్లో కోత పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తానని చెబుతున్నారని, అలా చేస్తే.. అతి తక్కువ పన్నులు చెల్లించే వారికి ఎలాంటి ప్రయోజనం దక్కుతుందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సునాక్‌కు భారతీయుల నుంచి ఘన స్వాగతం లభించింది.

బ్రిటన్‌ ప్రధానమంత్రి రేసులో ఉన్న రిషి సునాక్‌, సొంత పార్టీకి చెందిన ప్రత్యర్థితో పోలిస్తే వెనుకంజలో కొనసాగుతున్నారు. కన్జర్వేటివ్‌ పార్టీ నేత పోటీలో లిజ్‌ ట్రస్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. కన్జర్వేటివ్‌ నేతను ఎన్నుకునేందుకు సెప్టెంబర్‌ 2 వరకు మాత్రమే గడువుంది. అప్పటిలోగా ఆ పార్టీకి చెందిన టోరీలు పోస్టల్‌, ఆన్‌లైన్‌ ద్వారా తమ ఓట్లను వేయనున్నారు. సెప్టెంబర్‌ 5న తుది ఫలితాన్ని వెల్లడిస్తారు. కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా గెలిచిన అభ్యర్థే బ్రిటన్‌ నూతన ప్రధానిగా అదే రోజు బాధ్యతలు చేపడతారు. ఈ నేపథ్యంలో కన్జర్వేటివ్‌ పార్టీ నేత పోటీలో ఉన్న ఇద్దరి నేతల మధ్య వ్యత్యాసం క్రమంగా పెరుగుతుండడంతో రానున్న 10 రోజుల్లోనే రిషి సునాక్‌ తనకు మరింత మద్దతు పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

రిషి సునాక్​ 1980 మే 12న ఇంగ్లాండ్​లోని సౌథాంప్టన్​లో జన్మించారు. వీరి పూర్వీకులది భారత్​లోని పంజాబ్​. వీరు తొలుత తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి.. అక్కడి నుంచి పిల్లలతో సహా యూకేకు వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే రిషి తల్లిదండ్రులు కలిశారు. రిషి బాల్యం అంతా ఇంగ్లాండ్​లోనే గడిచింది. తర్వాత కాలిఫోర్నియాలోనూ చదువుకున్నారు. అక్కడే ​ఇన్ఫోసిస్​ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి.. 2009లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. 2014 బ్రిటన్​ రాజకీయాల్లోకి ప్రవేశించిన సునాక్​.. 2015లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్​మండ్​ నుంచి పోటీచేసి తొలిసారి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత మరోసారి రిషి విజయం సాధించారు. బోరిస్‌ జాన్సన్​ ప్రధానిగా ఎన్నికైన తర్వాత రిషికి.. ఆర్థిక శాఖ చీఫ్‌ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. సునాక్ పనితీరును మెచ్చి 2020 ఫిబ్రవరిలో తన తొలి పూర్తిస్థాయి కేబినెట్​ విస్తరణలో.. బ్రిటన్​ ఆర్థిక మంత్రిగా నియమించారు జాన్సన్​. ఇప్పుడు ఏకంగా ప్రధాన మంత్రి పదవి కోసం పోటీలో ఉన్నారు.
ఇప్పుడు రిషి సునాక్​ గెలిస్తే.. బ్రిటన్​ ప్రధానిగా ఎన్నిక కానున్న తొలి భారత సంతతి వ్యక్తిగా ఘనత సాధిస్తారు.

ఇవీ చూడండి: 'అప్పటి నుంచి ఆయన నా ఫోన్‌ కాల్స్‌కు స్పందించడం లేదు'

'దుస్తులు, బూట్లు ఎక్కడపడితే అక్కడే.. ఓరి దేవుడా!'.. భార్య గురించి రిషి సునాక్​

Last Updated : Aug 24, 2022, 8:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.