ETV Bharat / international

భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. ఛార్జీ రూ.3వేలే.. అందుకోసమేనటా! - భర్త అద్దె

HUSBAND FOR HIRE: ఓ మహిళ తన భర్తను అద్దెకిస్తోంది. అందుబాటు ధరకే అన్ని పనులు చేసిపెడతాడని ఆమె చెబుతోంది. అయితే కొంతమంది ఈ ప్రకటనను చూసి తప్పుగా ఆలోచిస్తున్నారట! వేరే పనుల కోసం ఇలా అద్దెకు ఇస్తున్నట్లు పొరపాటు పడుతున్నారట! అసలేంటీ కథ...?

HUSBAND ON RENT
HUSBAND ON RENT
author img

By

Published : Jul 2, 2022, 1:41 PM IST

HUSBAND ON RENT: యూకేకు చెందిన లారా యంగ్ అనే ఓ మహిళ వినూత్నంగా ఆలోచించింది. డబ్బులు సంపాదించేందుకు తన భర్తను అద్దెకిస్తోంది. ఇందుకోసం 'రెంట్ మై హ్యాండీ హస్బెండ్' పేరుతో ఓ వెబ్​సైట్ ఓపెన్ చేసింది. చిన్నచిన్న పనులు చేసిపెట్టేందుకు తన భర్తను అద్దెకు ఇస్తున్నట్లు మహిళ తెలిపింది. ఇళ్లలో ఫర్నీచర్​ను సెటప్ చేసిపెడుతూ జీవనం సాగదీస్తున్న ఓ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఆలోచన చేసినట్లు లారా చెబుతోంది.

HUSBAND ON RENT
జేమ్స్, లారా దంపతులు

ఆ పనుల్లో నేర్పరి..
UK Woman rents her husband: లారా భర్త జేమ్స్.. ఇంటి పనుల్లో దిట్ట. చిన్నచిన్న పనులను అలవోకగా పూర్తి చేస్తాడు. పెయింటింగ్, డెకరేషన్, టైల్స్, కార్పెట్లు ఏర్పాటు చేయడం వంటి పనులను నేర్పుతో చేస్తాడు. బకింగ్​హమ్​షైర్​లోని తన ఇంట్లో పనికిరాని వస్తువులను ఉపయోగించి డైనింగ్ టేబుల్ తయారు చేశాడు. సొంతంగా బెడ్​లను రూపొందిస్తున్నాడు. అందుకే అతడి నైపుణ్యాలను ఉపయోగించుకుంటున్నట్లు లారా చెబుతున్నారు.

"ఇంటి పనులు, గార్డెన్ పనులను మెరుగ్గా చేస్తారు. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది. ఈయన స్కిల్స్​ను ఉపయోగించుకొని అద్దెకు ఇవ్వొచ్చు కదా అని! చాలా మందికి ఇది నచ్చింది. కొన్నిసార్లు చిన్నచిన్న పనులు చేసిపెట్టేందుకు ఎవరూ ముందుకురారు. ఫర్నిచర్ విడిభాగాలను కలిపి పెట్టడం, ట్రాంపోలిన్ ఏర్పాటు చేయడం, షెల్ఫ్​లలో సామాను అమర్చడం వంటి పనులకు జేమ్స్ సరిగ్గా సెట్ అవుతారు. భర్తలు ఆ పనులు చేసిపెడతారని మనం చాలా రోజుల నుంచి ఎదురుచూసి విసిగిపోతాం. అలాంటి పనులను చేసిపెట్టేందుకు ఒకరు దొరికితే మంచిదే కదా."
-లారా యంగ్

జేమ్స్ గతంలో ఓ వేర్​హౌస్​లో నైట్​షిఫ్ట్​ కార్మికుడిగా పనిచేసేవాడు. రెండేళ్ల క్రితం తన ఉద్యోగాన్ని వదిలేసి.. లారాకు సహాయం చేస్తున్నాడు. ఆటిజం సమస్యతో బాధపడుతున్న తన ఇద్దరు పిల్లలు, మరో చిన్నారిని చూసుకుంటున్నాడు.
'కొత్త వస్తువులు తయారు చేయడం అంటే ఆయనకు చాలా ఆసక్తి. మా ఇంటిని తీర్చిదిద్దేందుకు ఆయన్ను ఉపయోగించుకున్నా. స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులకు సైతం సాయం చేస్తున్నాం. టీవీని గోడకు అమర్చడం, గోడలకు పెయింటింగ్ వేయడం ఇలా ఏ పనీ తక్కువ కాదు. ఇతరుల కోసమైతే.. 35 పౌండ్లను (సుమారు రూ.3,340) ఛార్జీలుగా వసూలు చేస్తున్నాం. అందరికీ అందుబాటులో ఉండాలనే తక్కువ ఛార్జీలు నిర్ణయించాం. దివ్యాంగులకు, 65ఏళ్లు పైబడినవారికి డిస్కౌంట్లు కూడా ఇస్తున్నాం' అని లారా చెబుతున్నారు.

'ఆ పనుల కోసం కాదు...'
అయితే, జేమ్స్​ను అద్దెకు ఇస్తానని ప్రకటించగానే చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారని లారా చెబుతున్నారు. 'చాలా మంది జేమ్స్​ను అద్దెకు తీసుకొనేందుకు ఆసక్తి చూపించారు. కానీ కొంతమంది తప్పుగా ఆలోచించారు. వేరే అవసరాల కోసం ఆయన్ను అద్దెకు ఇస్తున్నానేమో అని భావించారు. కానీ నేనా ఆ పని చేయను. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా అలా చేయను' అని అంటున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.